రొంపిచర్ల: కడప జిల్లా రాజంపేటలో ఈనెల 13,14,15 తేదీల్లో జరిగిన రాష్ట్ర స్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో గుంటూరు జిల్లా బాలికల జుట్టు తృతీయ స్థానం సాధించిందని గుంటూరు జిల్లా సాఫ్ట్బాల్ సెక్రటరీ పి.సామంత్రెడ్డి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వారికి స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కోచింగ్ క్యాంప్ ఏర్పాటు చేసి శిక్షణ ఇచ్చామన్నారు. రాష్ట్రస్థాయి జూనియర్ సాఫ్ట్బాల్ పోటీల్లో తృతీయ స్థానం సాధించిందిన గుంటూరు జిల్లా బాలికల జుట్టును ప్రధానోపాధ్యాయులు బీఎం సుభానీ, వ్యాయామ ఉపాధ్యాయులు సైదయ్య, ఎస్ఎంసీ చైర్మన్ యిట్టె ఏడుకొండలు, పూర్వ విద్యార్థు సంఘం నాయకులు పిడెం హుస్సేన్, పంబా వెంకట్, గ్రామ పెద్దలు అభినందించారు.


