‘కశ్మీర్‌ మారథాన్‌ – 2026’కు దరఖాస్తు చేసుకోండి | - | Sakshi
Sakshi News home page

‘కశ్మీర్‌ మారథాన్‌ – 2026’కు దరఖాస్తు చేసుకోండి

Oct 15 2026 8:12 AM | Updated on Oct 15 2026 8:12 AM

‘కశ్మీర్‌ మారథాన్‌ – 2026’కు దరఖాస్తు చేసుకోండి పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్‌ ఆటో బోల్తా.. ఎనిమిది మందికి తీవ్రగాయాలు పీఎండీఎస్‌ సాగు విధానంపై అధ్యయనం అర్హులైన టీచర్లను ఓటర్లుగా నమోదు చేయాలి గుంటూరు వెస్ట్‌: ఉమ్మడి కృష్ణా– గుంటూరు జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఎలక్టోరల్‌ రోల్స్‌ తయారీలో అర్హత కలిగిన ప్రతి ఉపాధ్యాయుడిని ఓటరుగా నమోదు చేసేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి షేక్‌ ఖాజావలి ఆదేశించారు. బుధవారం ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలకు చెందిన రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓలు, ఎంఈఓలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. డీఆర్వో మాట్లాడుతూ ఓటరు జాబితాల తయారీ, ఉపాధ్యాయుల అర్హతలు, నమోదు ప్రక్రియ, నిర్ణీత గడువులోగా జాబితాల ప్రచురణ తదితర అంశాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఉన్నత పాఠశాలలు, ఆపై స్థాయి విద్యాసంస్థల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఈ ఎన్నికల్లో ఓటరుగా నమోదయ్యేందుకు అర్హులని తెలిపారు.

జిల్లా క్రీడాభివృద్ధి అధికారి నరసింహారెడ్డి

నరసరావుపేట ఈస్ట్‌: జమ్మూ కశ్మీర్‌ రాష్ట్రం శ్రీనగర్‌లో ఈనెల 25వ తేదీన నిర్వహించనున్న 3వ కశ్మీర్‌ మారథాన్‌ – 2026లో పాల్గొని ప్రతిభ చాటాలనుకునే క్రీడాకారులు ఈనెల 15వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి బుధవారం తెలిపారు. మారథాన్‌ పూర్తి పరుగు పందెంలో విజేతకు రూ.25 లక్షలు, హాఫ్‌ మారథాన్‌ పోటీలో పురుషులు, మహిళలకు ఒక్కొక్కరికి రూ. 15లక్షలు నగదు బహుమతులు అందచేస్తారని పేర్కొన్నారు. జిల్లాలోని క్రీడా సంఘాలు, విద్యా సంస్థలు, ఆసక్తి గల అథ్లెట్స్‌ గడువులోగా తమ పేరును https://www.kashmirmarathon.jk.gov.in వెబ్‌సైట్‌లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

అమరావతి: మండల పరిధిలోని కర్లపూడి గ్రామంలో బాలికపై నెల 7వ తేదీ జరిగిన లైంగిక దాడి ఘటనలో మంగళవారం పోక్పో కేసు నమోదు చేశారు. ఈ కేసులో నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు. స్థానిక సీఐ అచ్చియ్య తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఘటనలో నిందితుడైన కుంభా గోపిని బుధవారం సాయంత్రం అమరావతి పోలీసులు కర్లపూడిలో అదుపులోకి తీసుకున్నారు. నిందితుడిని సత్తెనపల్లి డీఎస్పీ చైతన్య సమక్షంలో విచారించిన అనంతరం రిమాండ్‌ నిమిత్తం సత్తెనపల్లి కోర్డులో హాజరు పరిచారు.

మాచర్ల: ప్రమాదవశాత్తు ఆటో బోల్తాపడి కూలీలు తీవ్రగాయాల పాలైన ఘటన బుధవారం జరిగింది. నాగార్జున సాగర్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం రంగిళ్ల గ్రామం నుంచి కొందరు కూలీలు నాగార్జునసాగర్‌ చింతల తండాకు పత్తి కూలి కోసం ఆటోలో వస్తుండగా ఆటో డ్రైవరు అజాగ్రత్తతో ఆటో బోల్తా పడింది. ఆటోలోని ఎనిమిది మందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను నాగార్జునసాగర్‌ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, చికిత్స అందిస్తున్నారు.

చేబ్రోలు: చేబ్రోలు మండలం వేజండ్లలో ప్రకృతి వ్యవసాయంలో సాగు చేస్తున్న పంటలను ఢిల్లీకి చెందిన సీఈఈడబ్ల్యూ(కౌన్సిల్‌ ఆఫ్‌ ఎన్విరాన్‌మెంట్‌ అండ్‌ ఎనర్జీ వాటర్‌) బృందం బుధవారం పరిశీలించింది. మండల పరిధిలోని వేజండ్ల గ్రామానికి చెందిన మహిళా రైతు వేజండ్ల రాణి ఆరేళ్ల నుంచి నిర్వహిస్తున్న పీఎండీఎస్‌ క్షేత్రంతో పాటు, ఈ ఏడాది చేపట్టిన పీఎండీఎస్‌ క్షేత్రం, రసాయన వ్యవసాయ క్షేత్రాన్ని బృందం సందర్శించింది. పంటల పెరుగుదల, మొక్కల దుబ్బులు, పంట ఆరోగ్యం తదితర అంశాలను పరిశీలించింది. పశుగ్రాసం కోసం పీఎండీఎస్‌ను వినియోగిస్తున్న రైతులతో బృందం సభ్యులు మాట్లాడారు. వరి, మిరప, కూరగాయలు సాగు చేస్తున్న రైతుల నుంచి సాగుకు ముందు, తర్వాత వచ్చిన మార్పులు, అనుభవాలు, భవిష్యత్‌లో ఈ విధానాన్ని కొనసాగించే ఆలోచనలపై వివరాలు సేకరించింది. మహిళా సంఘాల సభ్యులతోనూ చర్చించి, పోషకాహార కిట్ల తయారీ, ఉత్పత్తుల నిర్వహణ, ఆదాయం, ఆర్థిక లావాదేవీల గురించి తెలుసుకున్నారు. రైతులు తమ అనుభవాలను వాటిని నమోదు చేసుకున్నారు. క్షేత్రస్థాయి పరిశీలన, రైతుల అనుభవాల ద్వారా పీఎండీఎస్‌ సాగు విధానంపై అధ్యయనం చేసింది. ఎం.ఖన్నా, పి.బంజా, అడిషనల్‌ డీపీఎం సత్యనారాయణ, వైపీ రవితేజ, వీరలక్ష్మి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement