రూ.5 వేలపై ఏసీబీ ఆరా..! | - | Sakshi
Sakshi News home page

రూ.5 వేలపై ఏసీబీ ఆరా..!

Oct 15 2026 8:12 AM | Updated on Oct 15 2026 8:12 AM

ఆరు నెలల క్రితం ఏసీబీ దాడుల్లో నగదు స్వాధీనం లంచం సొమ్మేనని నిర్థారించేందుకు తాజాగా విచారణ అధికారుల రాకతో రిజిస్ట్రార్‌ కార్యాలయంలో కలకలం

నరసరావుపేట టౌన్‌: కొండను తవ్వి ఎలుకను కూడా పట్టుకోలేని చందంగా తయారైంది. అవినీతి నిరోధక శాఖ అధికారుల తీరు.. గతంలో నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో నిర్వహించిన ఏసీబీ దాడుల్లో ఉద్యోగి వద్ద రూ.5 వేలు నగదు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ నగదు లంచానికి సంబంధించిందేననని నిర్థారించేందుకు అధికారులు బుధవారం విచారణ చేపట్టటం చర్ఛనీయాంశంగా మారింది. వివరాల్లో కెళ్లితే.. పల్నాడు జిల్లా కేంద్రం నరసరావుపేట జిల్లా రిజిస్ట్రార్‌ కార్యాలయంలో 6 నెలల క్రితం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని ఓ ఉద్యోగి వద్ద అక్రమంగా రూ.5 వేల నగదు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ నగదు లంచానికి సంబంధించిందేనా.. ఏ పనికి తీసుకున్నారు. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరిదైనా పాత్ర ఉందా. . అనే కోణాల్లో అధికారులు విచారణ చేపట్టినట్లు సమాచారం. ఏసీబీ అధికారుల రాకతో రిజిస్ట్రార్‌ కార్యాలయం అధికారులు అప్రమత్తం అయ్యారు. నిత్యం డాక్యుమెంట్‌ రైటర్‌లు, ప్రైవేటు వ్యక్తుల రాకపోకలతో సందడిగా ఉండే కార్యాలయం ఏసీబీ అధికారులు ఉన్నంతసేపు ఇతరులు ఎవ్వరూ కనిపించలేదు. కాగా రిజిస్ట్రార్‌ కార్యాలయంపై తరుచూ అవినీతి ఆరోపణలు వినిపిస్తున్న నేపథ్యంలో తాజాగా ఏసీబీ అధికారుల విచారణ ప్రాధాన్యం సంతరించుకొంది. నగదు స్వాధీనం చేసుకోవటంతో ఆగకుండా వెనుక ఉన్న వాస్తవాలను వెలికి తీసి బాధ్యులపై చర్యలు తీసుకుంటేనే ఏసీబీ దాడుల లక్ష్యం నెరవేరుతోంది. దొరికిన రూ.5 వేల నగదు వ్యవహారంలో ఏసీబీ విచారణ ఎలాంటి ఫలితాలను ఇస్తుందో వేచి చూడాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement