సత్తెనపల్లి: రాష్ట్ర యోగా పోటీల్లో పల్నాడు జిల్లా సత్తెనపల్లికి చెందిన శక్తి యోగా సభ్యులు ప్రతిభ చూపి బంగారు పతకాలు కై వసం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ యోగ అసోసియేషన్, ఇండియన్ యోగ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 10, 11 లలో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగా పోటీలలో సత్తెనపల్లి శక్తి యోగ సభ్యులు యోగా గురువు పీఎం రమేష్ మార్గదర్శకత్వంలో పాల్గొని ప్రతిభ కనబరిచారు. పలువురు సభ్యులు పతకాలు సాధించడంతో పాటు జాతీయ స్థాయి యోగా పోటీలలో పాల్గొనేందుకు అర్హత సాధించారు. రాష్ట్ర స్థాయిలో 40–50 సంవత్సరాల వయస్సు విభాగంలో ముసునూరి సునీల్‌కుమార్ ద్వితీయ స్థానం సాధించి సిల్వర్ మెడల్, తల్లం ఆంజనే యులు తృతీయ స్థానం సాధించి బ్రాంజ్ మెడల్, 50–60 సంవత్సరాల వయస్సు విభాగంలో ధనేకుల సాంబశివరావు ప్రథమ స్థానం సాధించి గోల్డ్ మెడల్, వల్లూరు శ్రీనివాసరావు 6వ స్థానం, పులహరి బానోజీ 8వ స్థానం, 60 సంవత్సరాల పైబడిన విభాగంలో ఈమని సత్యనారాయణరెడ్డి 6వ స్థానం, పులికొండ శ్రీనివాసరావు 9వ స్థానం కై వసం చేసుకున్నారు. యోగా గురువు పీఎం రమేష్ మాట్లాడుతూ శక్తి యోగ సభ్యుల విజయాలు సత్తెనపల్లికి గర్వకారణమన్నారు. యోగా పట్ల అంకితభావం, నిరంతర సాధన, క్రమశిక్షణతో రాష్ట్రస్థాయి పోటీలలో ప్రతిభ కనబరిచిన శక్తి యోగ సభ్యులు సత్తెనపల్లి, ఉమ్మడి గుంటూరు జిల్లా కీర్తిని చాటారన్నారు. ఈ విజయాలు యోగా సాధన పట్ల వారి నిబద్ధతకు నిదర్శనంగా నిలిచాయన్నారు.విజేతలందరికీ ఆయన అభినందనలు తెలిపారు. రాబోయే జాతీయ స్థాయి పోటీలలో మరిన్ని విజయాలు సాధించి సత్తెనపల్లి పేరును జాతీయస్థాయిలో నిలబెట్టాలని ఆకాంక్షించారు.


