పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

Sep 30 2026 1:46 AM | Updated on Sep 30 2026 1:46 AM

పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలి

పెన్షనర్స్‌ అసోసియేషన్‌ డిమాండ్‌

నరసరావుపేట ఈస్ట్‌: జీవిత కాలం ప్రజలకు సేవలు అందించిన రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం చిత్తశుద్ధితో పరిష్కరించాలని పెన్షనర్ల సంఘం ప్రతినిధులు కోరారు. ఆల్‌ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు మంగళవారం రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్స్‌ అసోసియేషన్‌ పల్నాడు జిల్లా శాఖ ఆధ్వర్యంలో నరసరావుపేట స్టేషన్‌ రోడ్డులోని ధర్నా పాయింట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. పెన్షనర్స్‌ భవన్‌ నుంచి పెన్షన్‌దారులు ర్యాలీగా ధర్నా పాయింట్‌ వద్దకు చేరుకున్నారు. ధర్నాలో పలువురు నాయకులు మాట్లాడుతూ పెన్షన్‌ రూల్స్‌– 2025ను రద్దు చేయాలనీ, 8వ వేతన సంఘం పరిధిలో పెన్షన్‌ సవరణ, మధ్యంతర భృతి వెంటనే ప్రకటించి విడుదల చేయాలని, 50 శాతం డీఏ, డీఆర్‌ను మూల వేతనం పెన్షన్‌లో విలీనం చేయాలని డిమాండ్‌ చేశారు. సీనియర్‌ సిటిజన్స్‌ కోసం చట్టబద్దమైన జాతీయ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. ధర్నాలో అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మానం సుబ్బారావు, కార్యదర్శి సి.సి.ఆదెయ్య, ఆర్గనైజింగ్‌ సెక్రటరీ చేగిరెడ్డి ఈశ్వరరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ పచ్చల నాగభూషణం, సలహాదారు పూజల హనుమంతరావు, రెబ్బా ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement