పిడుగురాళ్ల రూరల్: పల్నాడు ప్రాంత ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను ప్రభుత్వ వైద్య రంగం ద్వారా చేరువ చేయడమే తమ ప్రధాన ధ్యేయమని పిడుగురాళ్ల మెడికల్ కళాశాల ఇన్‌ఛార్జ్ సూపరింటెండెంట్ డాక్టర్ గౌరి, ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ డాక్టర్ సుధాకర్ బాబు, అన్నారు. పల్నాడు జిల్లా పిడుగురాళ్ల మండలంలోని కామేపల్లి గ్రామంలోనే మెడికల్ వైద్య, కళాశాలలో అత్యాధునిక ఎక్స్–రే యూనిట్‌ను మంగళవారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కాలేజీ ఆసుపత్రిలో అత్యాధునిక ఎక్స్–రే యూనిట్ అందుబాటులోకి రావడం వల్ల ఎముకల పగుళ్లు, ఛాతీ ఇన్ఫెక్షన్‌లు, ఇతర ప్రాథమిక ఆరోగ్య సమస్యలను తక్షణమే, ఖచ్ఛితంగా నిర్ధారించడం వీలవుతుందని పేర్కొన్నారు. దీనివల్ల రోగులు ప్రైవేట్ డయాగ్నస్టిక్ సెంటర్లకు వెళ్లి ఆర్థికంగా నష్టపోవాల్సిన అవసరం తప్పుతుందన్నారు. రేడియాలజీ ఇన్‌చార్జి డాక్టర్ సౌజన్య, ఆర్థోపెడిక్ విభాగం ఇన్‌చార్జి డాక్టర్ జోత్స్న, వైద్య సిబ్బంది, స్టాఫ్ నర్సులు పాల్గొన్నారు


