ఇటీవల అద్దంకి వెళ్లేందుకు నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్‌లో బస్సు ఎక్కుతుండగా నా సెల్‌ఫోన్ కాజేశారు. అదే రోజు మరో ఇద్దరు ప్రయాణికుల సెల్‌ఫోన్లు కూడా చోరీకి గురయ్యాయి. బస్సు ఎక్కే సమయంలో రద్దీని ఆసరాగా చేసుకుని జేబు దొంగలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. రూ.1.40 లక్షల విలువైన ఫోన్ పోగొట్టుకుని, రికవరీ కోసం పోలీస్‌స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా. బస్టాండ్‌లో ప్రయాణికులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉంది.
– సీహెచ్ నరసింహారావు, ప్రయాణికుడు


