రాజన్నా.. మరువలేమన్నా... | - | Sakshi
Sakshi News home page

రాజన్నా.. మరువలేమన్నా...

Sep 3 2026 4:03 AM | Updated on Sep 3 2026 4:03 AM

రాజన్నా.. మరువలేమన్నా... ● వాడవాడలా వైఎస్‌ రాజశేఖరరెడ్డికి ఘన నివాళులు ● మహానేత సేవలను స్మరించుకున్న వైఎస్సార్‌సీపీ శ్రేణులు

నిత్యం సంక్షేమం, అభివృద్ధిపై దృష్టి పెట్టి ప్రజల జీవితాలను మార్చిన మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి. తొలుత వైద్యుడిగా పేదల బాధలను చూశారు... తర్వాత నాయకుడిగా ప్రజల సమస్యలను విన్నారు... అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి పరిష్కారం చూపించాలనే తపనతో పాలించారు. బుధవారం ఆయన వర్ధంతి సందర్భంగా జిల్లావ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లోనూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆయనకు ఘన నివాళులు అర్పించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగారని కొనియాడారు. అభివృద్ధి ఫలాలను ప్రజలకు అందించిన ఆయన సేవలను స్మరించుకున్నారు. రాజన్నా.. నిను మరువలేమన్నా.. అంటూ మహానేతను మరోసారి గుర్తుచేసుకున్నారు.

– సాక్షి నెట్‌వర్క్‌

వినుకొండ రూరల్‌ మండలంలోని విఠంరాజుపల్లిలో

వైఎస్సార్‌ విగ్రహానికి నివాళులు అర్పిస్తున్న

మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు, నాయకులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement