ఈపూరు: కుటుంబ కలహాల నేపథ్యంలో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకోగా ఎనిమిది మందికి గాయాలైన ఘటన మండలంలోని అగ్నిగుండాల గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. బొల్లాపల్లి మండలం వెల్లటూరు గ్రామానికి చెందిన ఓ కుటుంబం రొంపిచర్ల మండలంలోని ఆరేపల్లి గ్రామానికి శుభకార్యానికి వచ్చి తిరిగి వెళ్తూ ఈపూరు మండలం బొగ్గరం గ్రామ ఎస్సీ కాలనీలోని బంధువుల ఇంటికి వెళ్లారు. కుటుంబ కలహాల నేపథ్యంలో అక్కడ ఉన్న మహిళలతో ఘర్షణ పడ్డారు. అనంతరం అగ్నిగుండాల గ్రామంలోని బంధువుల ఇంటికి చేరారు. గొడవ సమాచారం తెలుసుకున్న బొగ్గరం ఎస్సీ కాలనీ వాసులు అగ్నిగుండాల చేరుకొని ఇరువర్గాలు ఒకరిపై ఒకరు, రాళ్లు, కరల్రతో దాడులు చేసుకున్నారు. ఈ దాడులలో బొగ్గరానికి చెందిన పావులూరి రాంబాబు, పావులూరి ప్రవీణ్ కుమార్, కొలనీడి రవిశంకర్, కోలనీడి నాగరాజు, గడ్డం వెంకటరమణ, పావులూరి అంకమ్మ, కోలనీడి చెన్నమ్మకు గాయాలవ్వగా ఈపూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పావులూరి రాంబాబు పరిస్థితి విషమంగా ఉండటంతో నరసరావుపేట తరలించారు. వెల్లటూరుకు చెందిన ఏడుకొండలు తలకు తీవ్ర గాయాలు కాగా వినుకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స కోసం గుంటూరు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


