చిలకలూరిపేట(యడ్లపాడు): విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనా విధానాన్ని పెంపొందించడంతో పాటు విజ్ఞానంపై ఆసక్తిని కలిగించే లక్ష్యంతో జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఏటా నిర్వహించే చెకుముకి సైన్స్ సంబరాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని శ్రీశారద జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ప్రతిభ పరీక్ష నిర్వహించారు. 8, 9, 10 తరగతులకు చెందిన సుమారు 300 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. ఈ సందర్భంగా జనవిజ్ఞాన వేదిక పల్నాడు జిల్లా ఉపాధ్యక్షుడు కల్లి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ జిల్లావ్యాప్తంగా 240 పాఠశాలల్లో చెకుముకి సైనన్స్ సంబరాలు నిర్వహించామని తెలిపారు. మొత్తం 15 వేల మంది విద్యార్థులు ప్రతిభ పరీక్షలు రాశారని పేర్కొన్నారు. చిలకలూరిపేట డివిజన్‌న్ విజేతలకు ఈ నెల 11న స్థానిక సాధినేని చౌదరయ్య హెలోస్ పాఠశాలలో బహుమతులు అందించనున్నారు. కార్యక్రమంలో సైన్‌న్స్ ఉపాధ్యాయుడు వై.శ్రీనివాసరావు, జనవిజ్ఞాన వేదిక ప్రతినిధులు డాక్టర్ పీవీ సుబ్బారావు, కేబీ వెంకటేశ్వరరావు, పాఠశాల హెచ్‌ఎం జ్యోతి పాల్గొన్నారు.


