కాంట్రాక్ట్ వైద్య ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని సార్వత్రిక ఎన్నికల ముందు యువగళం పాదయాత్రలో లోకేష్ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టి రెండున్నరేళ్లు దాటుతున్నా కాలయాపన చేస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా విధులు నిర్వహిస్తూ వెట్టి చాకిరీ చేస్తున్నాం. రెగ్యులర్ చేసేవరకు గ్రాస్ శాలరీ నూరు శాతం చెల్లించాలి. రెగ్యులర్ ఉద్యోగుల మాదిరిగానే అన్ని సదుపాయాలు కల్పించాలని ఆందోళన చేపడుతున్నాం.
–బి.నాగరాజ కుమారి, కాంట్రాక్ట్ మెడికల్ జిల్లా జేఏసీ అధ్యక్షురాలు, పల్నాడు


