రాష్ట్రస్థాయి పోటీలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు

Aug 30 2026 4:49 AM | Updated on Aug 30 2026 4:49 AM

రాష్ట్రస్థాయి పోటీలో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు

నరసరావుపేట ఈస్ట్‌: రాష్ట్రస్థాయి అమరావతి చాంపియన్‌షిప్‌– 2026 పోటీల్లో పల్నాడు జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. తిరుపతిలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో పల్నాడు జిల్లా నుంచి 364 మంది క్రీడాకారులు పాల్గొన్నట్టు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి తెలిపారు. వివిధ క్రీడల్లో పాల్గొన్న క్రీడాకారులు మూడు బంగారు, ఏడు రజిత పతకాలు సాధించారు. పతకాలు సాధించిన వారిలో అండర్‌–17 బాలుర కబడ్డీ జట్టు, ఆర్చరీ రికర్వ్‌ విభాగంలో ఎం.మారుతి అరుష్‌రెడ్డి, అథ్లెటిక్స్‌ షాట్‌పుట్‌లో అహ్మద్‌ ఆసియా బంగారు పతకాలు సాధించారు. అలాగే అథ్లెటిక్స్‌లో కుంచాల చంద్రశేఖర్‌ (లాంగ్‌జంప్‌) రూపలిత పాత్ర (జావెలిన్‌ త్రో), అండర్‌–23 పురుషుల విభాగంలో 4‘‘100 మీటర్లు రిలే జట్టు, బాక్సింగ్‌ సిహెచ్‌ నవ్యశ్రీ, వెయిట్‌లిఫ్టింగ్‌ షేక్‌.జహీర్‌. బాలికలు అండర్‌– 17 విభాగంలో బాస్కెట్‌బాల్‌, బాలుర అండర్‌– 17 విభాగంలో వాలీబాల్‌ జుట్టు రజిత పతకాలు సాధించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను, కోచ్‌లను జిల్లా క్రీడాభివృద్ధి అధికారి పి.నరసింహారెడ్డి అభినందించారు.

అమరావతి చాంప్‌ పోటీలో 10 పతకాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement