పిడుగురాళ్ల: రాజకీయాల్లో చంద్రబాబునాయుడు ఓ కొత్త విష సంస్కృతికి పునాది వేస్తున్నారని, ఇది రాబోయే రోజుల్లో తీవ్రమైన పరిణామాలు చోటుచేసుకుంటాయని గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. బుధవార సెల్ఫీ వీడియోలో ఆయన మాట్లాడుతూ... గతంలో చంద్రబాబునాయుడు, సోనియా గాంధితో కలిసి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని జైలులో పెట్టించారని ఆరోపించారు. వైఎస్ జగన్ ఎంపీ కాకముందు విజయవంతమైన వ్యాపారవేత్త, పవర్ స్టేషన్స్, సిమెంట్ పరిశ్రమల వలన ఎంతో మందికి కడపలో ఉపాధి కల్పించారని గుర్తుచేశారు. కొన్ని వేల కోట్లు రూపాయలు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలకు పన్ను రూపంలో చెల్లించారన్నారు. ఈ రోజున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై ఉన్న కోపంతో ఆ పరిశ్రమ మూత పడేటట్లు, అక్కడ అలజడలు సృష్టించి, పరిశ్రమ మూత పడేటట్లు చేస్తున్నారని విమర్శించారు. ఆలోచించుకోవాలని ఎవరికి పదవి శాశ్వతం కాదు, ఈ పదం జగన్‌మోహన్‌రెడ్డి, కాసు మహేష్‌రెడ్డి కన్నా బ్రహ్మాండంగా తెలిసిన వ్యక్తి చంద్రబాబునాయుడు అని, ఆరు సార్లు ఎన్నికలల్లో పోటీ చేస్తే మూడు సార్లు మాత్రమే చంద్రబాబునాయుడు గెలిచారని చెప్పారు. రేపు గ్యారెంటీ లేదు, రేపు జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రి అవుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్‌మోహన్‌రెడ్డి, చంద్రబాబునాయుడు ఇద్దరు శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమేనని, ప్రత్యర్థులను గౌరవించుకోవడం, రాజకీయాలు చేయటం, అది గత రాజకీయ పెద్దలు నేర్పిందని ఆయన తెలిపారు. ఇది చేరిపేస్తామంటారా దీని పర్యావసానాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం భరించాల్సి వస్తుందని, ఇది మంచి సంస్కృతి కాదని హెచ్చరించారు. పరిశ్రమలు రావాలని కోరుకుంటున్న తరుణంలో కొన్ని వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తూ, కొన్ని వేల కోట్ల పన్ను రాబడుతున్న భారతి సిమెంట్ సక్రమంగా నడిచే విధంగా ఈ ప్రభుత్వమే చర్యలు తీసుకోవాలని కాసు డిమాండ్ చేశారు.
నరసరావుపేట రూరల్: రావిపాడు పరిధిలోని మా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి పంటను ద్వంసం చేయడంతో పాటు తమపై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని రెడ్డినగర్‌కు చెందిన వెన్నా మాధవి జిల్లా అదనపు ఎస్పీ రోహిత్‌కుమార్ చౌదరికి విన్నవించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో బుధవారం అదనపు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. వివరాలు.. మా కుమారులు వెన్న రాజసింహరెడ్డి, వెన్న భరత్ సింహరెడ్డిలకు రావిపాడులోని సర్వే నెంబరు 379/ఏ2లో 2.10 ఎకరాల భూమి ఉంది. అందులో సుబాబుల్ సాగు చేస్తున్నారు. ఈనెల 7వ తేదీన కోటపాటి సాయికృష్ణ, గాడిపర్తి శ్రీనివాస్, వంశీకృష్ణ, శ్రీనివాస్ మరి కొంతమంది మా భూమిలోకి అక్రమంగా ప్రవేశించి పొక్లెయిన్‌తో సుబాబుల్ పంటను ధ్వంసం చేశారు. సుమారు రూ.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. అడ్డుకునేందుకు ప్రయత్నించగా నా కుమారుడు భరత్‌సింహరెడ్డి, భర్త శ్రీనివాసరెడ్డిపై దాడి చేశారు. ప్రాణరక్షణ కోసం డయల్ 100కు ఫోన్ చేశారు. 2020లో కోటపాటి మల్లికార్జునరావు మా భూమిని కొనుగోలుకు అగ్రిమెంట్ చేసి డబ్బులు చెల్లించలేదు. కానీ ఉమ్మడి ఆస్తిగా ఉన్న రైస్ మిల్‌ను మాకు తెలియకుండా మల్లికార్జునరావు రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. వీటికి సంబంధించిన సివిల్ కేసులు కోర్టులో ఉన్నాయి. అయితే కోటపాటి సాయికృష్ణ, తిరుపతమ్మ, చైతన్య, మాధవి, గాడిపర్తి శ్రీనివాస్ పదేపదే బెదిరిస్తున్నారని ఫిర్యాదు పేర్కొన్నారు. సాయికృష్ణ తన తండ్రి మల్లికార్జునరావు, తడకమల్లి రమేష్ హత్యలో పాత్ర ఉందని ఫిర్యాదులో ఆరోపించారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు.


