భారీ కోతలకు సిద్ధమైన చంద్రబాబు ప్రభుత్వం
తల్లికి వందనంపై స్పష్టత ఇవ్వని పాలకులు
అర్హులందరికీ లబ్ధి చేకూరడంపై సందేహం
తప్పుల సవరణకు చర్యలు శూన్యం
జిల్లాలో లక్షల మంది ఎదురుచూపులు
సత్తెనపల్లి: ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓ మాట .. అధికారంలోకి వచ్చాక మరో మాట చెప్పడం సీఎం చంద్రబాబుకు ఆది నుంచీ అలవాటే. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాము అధికారంలోకి రాగానే ఒక్కో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం వర్తింపచేస్తామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత వివిధ కారణాలతో వేల మంది తల్లులకు నిరాశే మిగిలిచ్చారు. అక్కడితో ఆగకుండా అర్హులందరికీ ఇస్తామంటూ ఆశపెట్టి ఎందరో తల్లులను కార్యాలయాలు చుట్టూ తిప్పించుకున్నారు. నగదు జమ చేయకుండా వారిని మానసిక క్షోభకు గురి చేశారు. మళ్లీ ఇప్పుడు 2026–27 విద్యా సంవత్సరానికి అదే బాటలో లబ్ధిదారులను ఇబ్బంది పెట్టేందుకు నూతన నిబంధనలు తీసుకువస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చాక ఒక్కో బిడ్డకు రూ.13 వేలు మాత్రమే ఇస్తామంటూనే.. వాటికీ కోత పెట్టడంపై మహిళలు మాట మార్చేశారు. తల్లికి వందనం పథకం పొందడానికి విద్యార్థులకు బ్యాంక్ ఖాతా ఉండాలంటూ ప్రచారం జోరుగా సాగుతోంది. కొందరు సచివాలయ ఉద్యోగులు సూచిస్తున్నట్లు సమాచారం.
తప్పుల సవరణకు అవకాశమేదీ?
వివిధ కారణాలతో పేద కుటుంబాల వారు సైతం తల్లికి వందనం పథకానికి దూరమయ్యారు. చిన్న తప్పులకు అనర్హుల కింద పరిగణించారని వాపోతున్నారు. ఈ ఏడాదైనా వారికి న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు చేపట్టడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో ప్రభుత్వం విఫలం అయినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. లబ్ధిదారుల సంఖ్య తగ్గిస్తారనే అనుమానాలు వారిలో తలెత్తుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఆందోళన నెలకొంది.
కోత
పెట్టడమే
లక్ష్యం...
ఒక్కో కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ రూ. 15 వేల చొప్పున తల్లికి వందనం కింద ఇస్తామని చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. లబ్ధిదారుల జాబితా తయారు చేయాలంటూనే తొలి ఏడాది ఎగనామం పెట్టారు. రెండో సంవత్సరం వచ్చిన తర్వాత కబుర్లు చెప్పి... రూ. 13 వేలను విద్యార్థులకు చెల్లించారు. ఇందులో చాలామందికి వివిధ కారణాలతో ఎగ్గొట్టేశారు. అదే బాటలో ఈ ఏడాది కూడా పలు నిబంధనలు తీసుకువచ్చి లబ్ధిదారుల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నారు.
జిల్లా వ్యాప్తంగా ఒకటి నుంచి 10వ తరగతి, ఇంటర్ విద్యార్థులు కలిపి 2,64,975 మంది ఉన్నారు. మొత్తంగా రూ. 397.46 కోట్లు తల్లికి వందనం కింద ఈ ఏడాది తల్లుల ఖాతాలకు జమ చేయాల్సి ఉంది. ఇంత వరకు అందించలేదు. ఎప్పుడు విడుదల చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. ఈ నెల 15 నుంచి 17వ తేదీలోగా పేరెంట్స్ డే సమావేశాలు నిర్వహించి ఆ సమయంలో విడుదల చేసే అవకాశాలున్నాయనే ప్రచారం నడుస్తోంది. గతంలో ఆధార్‌కు బ్యాంక్ లింకేజీ, రేషన్ కార్డుల్లో తప్పులు, ఈ–కేవైసీ, బయోమెట్రిక్, తదితర 47 కారణాలు చూపించడంతోపాటు 75 శాతం హాజరు లేదంటూ పేర్కొంటూ 20 శాతం మందికి ఎగనామం పెట్టారు. దీంతో అవాకై ్కనా తల్లులు రేషన్, ఆధార్ కార్డులతోపాటు స్కూల్ సర్టిఫికెట్లలోని పొరబాట్లను సవరించుకున్నారు. రెండో దశ, మూడో దశ అంటూ పాలకులు మాయమాటలు చెప్పారు.


