కార్యకర్తలే పార్టీకి శ్రీరామరక్ష | - | Sakshi
Sakshi News home page

కార్యకర్తలే పార్టీకి శ్రీరామరక్ష

Jul 7 2026 2:01 AM | Updated on Jul 7 2026 2:01 AM

వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పీఆర్కే

వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పీఆర్కే

రెంటచింతల: గ్రామ స్థాయిలో ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీ బలోపేతానికి నిరంతరం కృషి చేస్తున్న కార్యకర్తలు, అభిమానులే మాజీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డికి, వైఎస్సార్‌ సీపీకి శ్రీరామ రక్ష అని పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని గోలి గ్రామంలో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... మాజీ సీఎం వైస్‌ జగన్‌ కన్నా ఎక్కువ ఇస్తామని చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు ప్రకటించిన హామీలను గత సార్వత్రిక ఎన్నికల సమయంలో నమ్మి ప్రజలు మోసపోయారని తెలిపారు. మొదటి 6 నెలల్లోనే ఈ విషయం వారికి అర్థమైందన్నారు. రాష్ట్రంలో అరాచక పాలనలో ప్రశ్నించే ఎంతోమందిపై తప్పుడు కేసులు పెడుతూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క హామీని కూడా వంద శాతం అమలు చేశానని చెప్పుకొనే ధైర్యం బాబుకు, మంత్రులకు ఉందా అని ప్రశించారు. 2019 ఎన్నికల సమయంలో మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ ఇచ్చిన హామీలతోపాటు రాష్ట్ర ప్రజల అవసరాలను గుర్తించి పలు పథకాలను ప్రతిష్ఠాత్మకంగా అమలు చేసిన విషయాన్ని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ చూసిన ప్రజా కంటక పాలనే నడుస్తోందన్నారు రెడ్‌బుక్‌ పాలన చేస్తున్న ప్రభుత్వాన్ని ఇంటికి పంపేందుకు ప్రజలు కూడా ఎదురు చూస్తున్నారన్నారు. వైఎస్‌ జగన్‌ను గెలిపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రస్తుతం జరుగుతున్న సర్‌ విషయంలో బీఎల్‌ఏలు అప్రమత్తంగా ఉండాలన్నారు.

ఘనంగా స్వాగతం

ముందుగా పీఆర్కేకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. జెడ్పీ వైస్‌ చైర్మన్‌ శొంఠిరెడ్డి నర్సిరెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గొట్టం బ్రహ్మారెడ్డి, మాజీ జెడ్పీటీసీ నవులూరి భాస్కర్‌రెడ్డి, వైస్‌ ఎంపీపీ ఏరువ శౌర్రెడ్డి, నాయకులు చల్లా మట్టారెడ్డి, మోర్తల ఉమ, నవులూరి చెన్నారెడ్డి, పురంశెట్టి సత్యనారాయణ, త్రిపుర నాగేశ్వరరావు, చట్టా మల్లికార్జున రావు, గొట్టం భాస్కర్‌ రెడ్డి, పాతపాటి పిచ్చిరెడ్డి, యర్రెద్దు శ్రీనివాసరెడ్డి, సోము శివారెడ్డి, తోడిచర్ల బాబు, పీట్ల బాజి, కొమ్ము దేవబిక్షం, బొల్లెంపల్లి ఏసుపాదం, కొమ్ము సాగర్‌, తోడిచర్ల రమేష్‌, వడితే చంద్రూనాయక్‌, బొజ్జా నాగేశ్వరరావు తదితరులున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement