జన‘ఇరికిరిక్‌’! | - | Sakshi
Sakshi News home page

జన‘ఇరికిరిక్‌’!

Jun 12 2026 6:03 AM | Updated on Jun 12 2026 6:03 AM

శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్‌ శ్రీ 2026 ఆక్రమణల పర్వంలో ప్రభుత్వ వైద్యశాల

న్యూస్‌రీల్‌

ఇప్పటికే రెండు జనరిక్‌ మెడికల్‌ షాపుల ఏర్పాటు మరో దుకాణం ఏర్పాటుకు రంగం సిద్ధం పార్కింగ్‌ కూడా అవకాశం లేకుండా ఆక్రమణలు అంబులెన్స్‌ రాకపోకలకు కూడాఅంతరాయం ట్రామాకేర్‌ ప్రారంభమైతే సమస్య మరింత తీవ్రం చర్యలు తీసుకోకుంటే భవిష్యత్తులో తప్పని ఇబ్బందులు ఉచిత మందులు ఇచ్చే చోట ఇన్ని ఎందుకని ప్రజల ఆగ్రహం

శుక్రవారం శ్రీ 12 శ్రీ జూన్‌ శ్రీ 2026
నరసరావుపేట వంటి ప్రాంతానికి ఎన్నో ఏళ్ల తర్వాత నూతన ఆసుపత్రి భవనం ఏర్పాటు చేశారని సంబరపడాలో.. అదే ఆసుపత్రి ఆవరణకు రాజకీయ గ్రహణం పట్టిందని బాధపడాలో తెలియని పరిస్థితి. పేదలకు మరింత వైద్య సేవలు అందించేలా ఆస్పత్రిని తీర్చిదిద్దాలని కోరుకోవాలో.. ఆసుపత్రిని ఆక్రమణలకు అడ్డాగా మార్చవద్దని వేడుకోవాలో అర్థంగాని దుస్థితి. ఆసుపత్రి ప్రాంగణంలోని ప్రతి అంగుళం పేద ప్రజల ఆరోగ్యాన్ని కాపాడే రక్షణ కవచంగా మార్చమని ప్రజలే ప్రభుత్వాన్ని వేడుకోవాల్సిన దీనస్థితి. ప్రస్తుతం నర్సరావుపేట ఏరియా వైద్యశాలలో జనరిక్‌ మందుల దుకాణాల ఏర్పాటు కిరికిరి చర్చనీయాంశంగా మారింది.
ఆక్రమణల పర్వంలో ప్రభుత్వ వైద్యశాల

నరసరావుపేట టౌన్‌న: పేదలకు వైద్యం అందించాల్సిన ప్రభుత్వ ఏరియా వైద్యశాల ప్రాంగణం వ్యాపార కేంద్రంగా మారుతోంది. అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల జోక్యం వెరసి ప్రైవేటు మెడికల్‌ దుకాణాల విస్తరణ పార్కింగ్‌ సమస్యను తీవ్రం చేస్తోంది. ఫలితంగా రోగులు, గర్భిణులు అత్యవసర సేవల వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పల్నాడు రోడ్డులోని ప్రసూతి వైద్యశాల మాతాశిశు సంరక్షణ విభాగాన్ని లింగంగుంట్లలోని ఏరియా వైద్యశాలకు తరలించిన తర్వాత రోగులు, గర్భిణుల తాకిడి పెరిగింది. గతంలో రెండు ఆసుపత్రులు వేరువేరు చోట్ల ఉండటంతో సమస్యలు పెద్దగా ఎదురుకాలేదు. ఇప్పుడు మొత్తం ఒకే చోట ఉండటంతో కనీస వసతులు లేక రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వైద్యశాల ఆవరణ వాహనాల పార్కింగ్‌తో నిండిపోతోంది. అంబులెన్స్‌లు నిలపటానికి స్థలం ఉండటం లేదు. దీంతో వాహనాలను మండుటెండలో నిలుపుతున్నారు. వైద్యశాలలో విధులు నిర్వహిస్తున్న డాక్టర్‌, సిబ్బంది ప్రత్యేక పార్కింగ్‌ సౌకర్యం లేకపోవటంతో రహదారులకు మధ్యలో వాహనాలు నిలుపుతున్నారు. ప్రాంగణంలో నిర్మాణంలో ఉన్న 150 పడకల క్రిటికల్‌ ట్రామాకేర్‌ ప్రారంభం అయితే రోగుల తాకిడి మరింత పెరగనుంది. అధికారులు ముందుచూపుతో వ్యవహరించక పోతే పార్కింగ్‌ సమస్య తీవ్రరూపం దాల్చనుంది. వైద్యశాల ప్రాంగణంలో కూటమిలోని ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు గతంలో జనరిక్‌ దుకాణం ఏర్పాటు చేశాడు. వైద్యశాలలో ఔషధాలు అందుబాటులో లేని కారణంగా జనరిక్‌ దుకాణం వైపునకు రోగులు మళ్లుతున్నారు. వ్యాపారాభివృద్ధిని చూసిన మరో అధికార పార్టీ నేత తాజాగా ఇంకో జనరిక్‌ దుకాణాన్ని అనుమతులు రాకముందే ఏర్పాటు చేశాడు. కావాల్సిన స్థలం కంటే ఎక్కువగా తీసుకొని శాశ్వత నిర్మాణం చేపట్టాడు. ఉచితంగా మందులు అందజేసే ప్రభుత్వ వైద్యశాలలో అక్రమంగా మరో మందుల దుకాణం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏంటని ప్రజలు చర్చించుకుంటున్నారు.

అంబులెన్స్‌లకు దారేది..

అత్యవసర సేవలకు ప్రాణధారంగా నిలిచే 108 అంబులెన్స్‌లు ఆసుపత్రికి రావటమే కష్టంగా మారింది. వాహనాలు ఇష్టారాజ్యంగా నిలపటంతో రాకపోకలకు ఆటంకం ఏర్పడుతోంది. అత్యవసర పరిస్థితుల్లో ప్రతి నిమిషం కీలకం. వాహనాల రద్దీ కారణంగా విలువైన సమయం వృథా అవుతుందని రోగులు, వారి బంధువులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్‌ ప్రదేశం తక్కువగా ఉండటంతో వాహనాలన్నీ ఒకేచోట నిలుపుతున్నారు. కొన్ని సందర్భాల్లో పార్క్‌ చేసిన వాహనం తీయటం కూడా కష్టతరంగా మారుతోంది. అత్యవసర సమయంలో పేషెంట్లను వైద్యశాలలో చేర్చాలన్నా, వైద్యశాల నుంచి మరోచోటుకు తరలించాలన్నా 108 సిబ్బందికు సవాల్‌గా మారుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement