సత్తెనపల్లి: ఏపీ ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పట్టణంలోని సుగాలికాలనీ జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో జూనియర్, సబ్ జూనియర్ బాలబాలికల జిల్లా జట్ల ఎంపికలు గురువారం ఉత్సాహంగా సాగాయి. ఈ ఎంపికలకు 80 మంది బాలికలు, 120 మంది బాలురు వివిధ ప్రాంతాల నుంచి హాజరయ్యారు. సబ్ జూనియర్స్ బాలుర విభాగంలో 25 మంది, బాలికల విభాగంలో 25 మంది, జూనియర్ బాలుర విభాగంలో 25 మంది, బాలికల విభాగంలో 25 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పల్నాడు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించనున్నారు. ఎంపికై న క్రీడాకారులకు ప్రతిరోజూ ఉదయం, సాయంత్రం సత్తెనపల్లి జిల్లా పరిషత్ సుగాలికాలనీ ఉన్నత పాఠశాలలో శిక్షణ క్యాంపు నిర్వహించనున్నట్లు ఫుట్‌బాల్ అసోసియేషన్ పల్నాడు జిల్లా అధ్యక్షుడు కె.సుబ్రహ్మేణ్యేశ్వరరావు తెలిపారు. ఆయనతోపాటు, కార్యదర్శి షేక్ షమ్మి, ఆర్గనైజింగ్ సెక్రటరీ రియాజ్, అసోసియేషన్ బాధ్యులు సుభాని, శ్రీరామిరెడ్డి, ఆలి, శ్రీనివాసరెడ్డి, జాన్‌సైదా, మహేశ్వరి, శ్రీను, ప్రవీణ్, శ్రావణిలు ఉన్నారు.
బాలికల జట్టు ఇదే..
సబ్ జూనియర్, జూనియర్స్ బాలికల జట్టుకు పి.విజయలక్ష్మి (సత్తెనపల్లి), పి.స్వాతి (సత్తెనపల్లి), షేక్ నాజియా (సత్తెనపల్లి), ఎన్.నిఖిత భవ్య (సత్తెనపల్లి), కె.సాయినిఖిత (సత్తెనపల్లి), కె.నాగమల్లేశ్వరి (సత్తెనపల్లి), పి.అక్షయ్ (సత్తెనపల్లి), పి.మానశ్రీ (సత్తెనపల్లి), ఆర్.శ్రీభవ్య (సత్తెనపల్లి), షేక్ ఆషికా (సత్తెనపల్లి), షేక్ మదీనా జాహ (సత్తెనపల్లి), ఎ.విశ్వఘ్నకృష్ణజ (సత్తెనపల్లి), పి.వేదశ్రీ (ముప్పాళ్ల), ఎస్.నాగరాజలక్ష్మి (ముప్పాళ్ల), వి.శ్రీమ్‌సీ (సత్తెనపల్లి), పి.విజయలక్ష్మి (సత్తెనపల్లి), షేక్‌జాస్మిన్ (సత్తెనపల్లి), టి.త్రివేణి (సత్తెనపల్లి), పి.అలేఖ్య (సత్తెనపల్లి), పి.ఈశ్వరి (సత్తెనపల్లి), పి.స్వాతికీర్తన (వినుకొండ), ఎస్.శ్రావ్య (మాదల), జి.చంద్రిక (ఇరుకుపాలెం), పి.ప్రవల్లిక (ఇరుకుపాలెం), పి.స్వాతి (అచ్చంపేట)లు ఎంపికయ్యారు.
బాలుర జట్టు ఇదే..
బాలుర విభాగంలో డి.శివసాయి (సత్తెనపల్లి), షేక్ దరియా హుస్సేన్ (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.ఇర్ఫాన్(సత్తెనపల్లి), షేక్ జావిద్ అలాం (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.వి.సాయిపుల్లా (నరసరావుపేట), ఆర్.వి.బి.శ్రీనివాస్ (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.సల్మాన్ (సత్తెనపల్లి), కె.నాని (గురజాల), ఎస్.కె.ఎండి.ఇర్ఫాన్ (మాదల), ఎ.విజయదుర్గ (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.అష్రఫ్ (సత్తెనపల్లి), ఎం.డి.ఎం.డి.రఫీ (సత్తెనపల్లి), కె.ఆకాష్ (సత్తెనపల్లి), గిరిప్రతాప్ (సత్తెనపల్లి), ఎం.కార్తీక్ (సత్తెనపల్లి), షేక్ ఫారూఖ్ (సత్తెనపల్లి), షేక్ జియావుద్దీన్ (సత్తెనపల్లి), కార్తీక్ (చల్లగుండ్ల), ఆర్.కార్తీక్ (సత్తెనపల్లి), కె.సాయిధనుంజయరెడ్డి (సత్తెనపల్లి), కె.షణ్ముఖ రెడ్డి (సత్తెనపల్లి), పి.రామాంజనేయులు (సత్తెనపల్లి), ఎం.ప్రణ్విత్ (సత్తెనపల్లి), అఖిల్ జోసఫ్ (రుద్రవరం), కె.చైతన్య (సత్తెనపల్లి), డి.నిభీష్‌రెడ్డి (సత్తెనపల్లి), టి.సాయివెంకటప్రసాద్ (సత్తెనపల్లి), వెంకట్ రుషీక్ (అచ్చంపేట), ఎస్.కె.ఎం.డి.సాయిముల్లా (నరసరావుపేట), పి.కఫీజ్ (సత్తెనపల్లి), కె.కార్తీకేయ (సత్తెనపల్లి), బి. లోకేష్ (చల్లంగుండ్ల), షేక్ రోహెల్ (సత్తెనపల్లి), పి.వాసు (సత్తెనపల్లి), షేక్‌రహీం (సత్తెనపల్లి), షేక్ అబ్దుల్ రెహమాన్ (సత్తెనపల్లి), టి.దీపక్ (సత్తెనపల్లి), ఎన్.నందకిషోర్ (సత్తెనపల్లి), పి.డాని (సత్తెనపల్లి), ఎస్.కె.ఎం.డి.అబ్దుల్ రహీం (సత్తెనపల్లి), వై.నరసింహ (సత్తెనపల్లి)లు ఎంపికయ్యారు.


