ఇదీ పరిస్థితి
నరసరావుపేట ఈస్ట్: బడి గంట మోగనుంది. వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 1,566 పాఠశాలలు తెరుచుకోనున్నాయి. గత విద్యా సంవత్సరంలో 2,79,880 మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యనభ్యసించారు. ఈ ఏడాది ఇప్పటి వరకు 2,73,975 మంది విద్యార్థులు నమోదయ్యారు. 2026–27 విద్యా సంవత్సరానికిగాను ఒకటో తరగతిలో 10,500 మంది విద్యార్థులు ప్రవేశాలు పొందారు. ఈ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు ప్రకటించటంతో విద్యార్థుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది.
పాఠశాలలు పునఃప్రారంభమయ్యే నాటికి సర్వేపల్లి రాధాకృష్ణ విద్యా మిత్ర కిట్లు విద్యార్థులకు అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ఇప్పటి వరకు కిట్లు జిల్లా కేంద్రానికి చేరుకోలేదు. గత ఏడాది మెగా పేరెంట్స్ మీటింగ్‌లో విద్యాకిట్లు అందిస్తామని ఆలస్యం చేసిన ప్రభుత్వం ఇప్పుడు కూడా ఇంతవరకు కిట్లు పాఠశాలలకు చేరవేయలేదు. జిల్లా పరిధిలోని 28 మండలాలకు ఇప్పటివరకు యూనిఫాం, షూస్, బ్యాగ్స్, నోట్‌బుక్స్, బెల్ట్‌లు చేరలేదు. పాఠ్యపుస్తకాలు 6,01,848 గాను 5,79,904, వర్క్‌బుక్స్ 1,28,194కు గాను 1,23,970 ఆయా మండలాలకు చేరుకున్నాయి. డిక్షనరీలను పంపిణీకి సిద్ధం చేశారు. నోట్ పుస్తకాలు మరో రెండు రోజుల్లో చేరుకుంటాయని భావిస్తున్నారు.
వస్తువు కావలసినవి వచ్చినవి శాతం
యూనిఫాం 1,41,879 0 0
షూస్ 1,41,879 0 0
బ్యాగ్స్ 1,41,879 0 0
నోట్‌బుక్స్ 8,04,253 0 0
బెల్ట్స్ 96,941 0 0
టెక్ట్స్ బుక్స్ 6,01,848 5,79,904 96.35
వర్క్‌బుక్స్ 1,28,194 1,23,970 97.70
ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలు 14,540 14,540 100
పిక్టోరియల్ డిక్షనరీలు 11,368 11,368 100


