ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించాలి

Jun 11 2026 7:35 AM | Updated on Jun 11 2026 7:35 AM

ప్రజా ఫిర్యాదులపై దృష్టి సారించాలి ఏపీఏఐఎంఎస్‌ ద్వారానే ఎరువుల విక్రయాలు ల్యాండ్‌ బ్రోకర్‌ దారుణ హత్య

ఎస్పీ వకుల్‌జిందాల్‌

నగరంపాలెం: జిల్లాలోని పోలీసు స్టేషన్‌లకు వచ్చే ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌ అన్నారు. నగరంపాలెం జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణలోని హాలులో బుధవారం నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో నమోదైన నేరాలు, దర్యాప్తు, పురోగతి, కేసు ఛేదించిన శాతం, నేరస్తుల అరెస్టులపై ఆరా తీశారు. ఎస్పీ మాట్లాడుతూ చట్టప్రకారం బాధితుల ఫిర్యాదులు పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. కొందరు పోలీసు అధికారులు ప్రజా ఫిర్యాదులపై నిర్లక్ష్యం వహిస్తున్నారని హెచ్చరించారు. ఫిర్యాదులు వచ్చే అధికారులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని సూచించారు. రానున్న స్థానిక ఎన్నికల దృష్ట్యా గ్రామాలు, వార్డుల వారీగా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులను గుర్తించాలని కోరారు. అవసరమైన చోట బైండోవర్‌ కేసులు నమోదు చేయాల్నారు. అంతేకాక వారిపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలన్నారు. సమావేశంలో జిల్లా ఏఎస్పీ జి.వి.రమణమూర్తి, ఏటీవీ రవికుమార్‌, డీఎస్పీలు అళహరిశ్రీనివాస్‌, సంతూరయ్య పాల్గొన్నారు.

డీలర్ల సమావేశంలో జేడీఏ పద్మావతి

కొరిటెపాడు: ఏపీ ఏఐఎంఎస్‌ ద్వారా ఎరువుల విక్రయాలు చేయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.పద్మావతి కోరారు. జిల్లాలోని ఎరువుల డీలర్లకు ఫర్టిలైజర్స్‌ కళ్యాణమండపంలో బుధవారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ రిటైల్‌ డీలర్లు ఇకపై ఏపీఏఐఎంఎస్‌ 2.ఓ పోర్టల్‌ ద్వారా మాత్రమే యూరియా, డీఏపీ ఎరువులను విక్రయించాలని స్పష్టం చేశారు. నిబంధనలు పాటించని డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పీడీ ఆత్మ వేంకటేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాలో సమతుల్య ఎరువుల వాడకం ఆవశ్యకతను వివరించారు. రసాయన ఎరువుల అధిక వాడకం వల్ల భూమికి, పర్యావరణానికి కలిగే దుష్పరిణామాలను డీలర్లకు వివరించారు. కార్యక్రమంలో ఏడీఏలు ఎన్‌. మోహనరావు, వి.రమాకోటేశ్వరి, ఆర్‌.విజయబాబు, పి.సంధ్యారాణి పాల్గొన్నారు.

పుల్లలచెరువు మండలం

శతకోడులో ఘటన

పుల్లలచెరువు: భూముల క్రయవిక్రయాలు సాగించేందుకు మధ్యవర్తిగా వ్యవహరిస్తున్న వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన పుల్లలచెరువు మండలం శతకోడు గ్రామంలో బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. అందిన సమాచారం మేరకు.. గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన రవికుమార్‌(42) అనే వ్యక్తి పొలాలు విక్రయిస్తూ, కొలుగోలు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కొన్ని రోజులుగా శతకోడు గ్రామానికి చెందిన వరికూటి పోలిరెడ్డితో కలిసి చుట్టపక్కల ప్రాంతాల్లో తిరిగాడు. బుధవారం సాయంత్రం గ్రామ శివారు ప్రాంతంలో శివాలయం వద్ద గుర్తు తెలియని మృతదేహం ఉందని స్థానికుల ద్వారా పోలీసులకు సమాచారం అందింది. సంఘటన స్థలాన్ని ఎస్సై సాంబశివరావు పరిశీలించారు. హత్యకు గురైన వ్యక్తిని రవికుమార్‌గా గుర్తించారు. గ్రామంలో ఇటీవల కాలంలో పోలిరెడ్డితో కలిసి రవికుమార్‌ తిరగడం చూశామని గ్రామస్తులు కొందరు చెప్పారు. హత్యకు పురిగొల్పిన కారణాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement