బెల్లంకొండ: మద్యం మత్తులో ఇద్దరు యువకులు ఒకరిపై ఒకరు దాడిచేసుకున్న సంఘటన మండలంలోని బెల్లంకొండ క్రాస్ రోడ్డు వద్ద ఉన్న వైన్స్ సమీపంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రాజుపాలెంకు చెందిన ఇరువురు యువకులు బైక్ వచ్చి మద్యం సేవిస్తున్నారు. ఈక్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం జరిగింది. మద్యం మత్తులో ఒకరికొకరు నెట్టుకున్నారు. గణేష్ అనే యువకుడిని మరో యువకుడు బీర్‌బాటిల్‌తో మెడపై దాడిచేశాడు. ఘటనలో గణేష్‌కు తీవ్రగాయమైంది. స్థానికులు వెంటనే 108 సహాయంతో ఇరువురిని సత్తెనపల్లి ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఘటనపై స్థానిక ఎస్సై గోపిని వివరణ కోరగా ఘటన స్థలంలో విచారించామని, యువకుల బంధువులు మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదన్నారు.
మంగళగిరి టౌన్: ట్రాక్టర్ అదుపుతప్పి గుంతలోకి జారిపడడంతో తీవ్ర గాయాల పాలైన డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. సేకరించిన వివరాల మేరకు.. మంగళగిరి మండలం నిడమర్రు గ్రామంలో నివాసముంటున్న శరత్‌బాబు (50) ట్రాక్టర్ డ్రైవర్‌గా మెగా కంపెనీలో పనిచేస్తున్నాడు. కురగల్లు గ్రామంలో మెగా కంపెనీ కింద గుంతల్లో నిల్వ ఉన్న నీటిని ట్రాక్టర్ ఇంజిన్‌తో డీవాటరింగ్ చేస్తున్నాడు. ఈ క్రమంలో జూన్ 9వ తేదీ మధ్యాహ్నం నీళ్లు ఉన్న గుంత అంచున ట్రాక్టర్ పెట్టి నీటి పైపును వేసి డీ వాటరింగ్ చేస్తున్నాడు. ట్రాక్టర్‌ను వెనక్కు తీసేందుకు ప్రయత్నిస్తున్న క్రమంలో గుంత అంచున ఉండడంతో ప్రమావశాత్తూ పక్కనే ఉన్న 20 అడుగుల లోతున్న గుంతలో జారిపడిపోయింది. డ్రైవర్ సీట్‌లో ఉన్న శరత్‌బాబు పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చి ట్రాక్టర్ కింద ఇరుక్కుపోయిన శరత్‌బాబును మెగా కంపెనీ అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం మంగళగిరి ఎయిమ్స్‌కు తరలించారు. తీవ్ర గాయాలు కావడంతో చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం శరత్‌బాబు మృతిచెందాడు. ఘటనపై మృతుడి కుమారుడు వంశీకుమార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


