రోడ్డు ప్రమాదంలో గణపవరం యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో గణపవరం యువకుడు మృతి

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

నాదెండ్ల: డిగ్రీ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణ కోసం హైదరాబాద్‌ వెళ్ళిన యువకుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో గణపవరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. గణపవరం గ్రామానికి చెందిన రిటైర్డ్‌ ఆర్‌డబ్ల్యూఎస్‌ వర్క్‌ ఇన్‌స్పెక్టర్‌ పురాణం బాలాజీశర్మ, శ్రీదేవి (అంగన్‌వాడీ టీచర్‌) దంపతులకు ఇరువురు కుమారులు. పెద్ద కుమారుడు సాయిసుబ్రహ్మణ్యేశ్వర శర్మ బీటెక్‌ పూర్తి చేసి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. రెండో కుమారుడు పురాణం లక్ష్మీనాగేశ్వర సాయిమోహన్‌ (23) డిగ్రీ పూర్తి చేసి హైదరాబాద్‌లో సోదరుడి వద్ద ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. గ్రామానికి చెందిన యువకుడు బాలమురళీకృష్ణ వీరితో పాటూ ఉంటూ ఎంబీఏ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 8న అర్ధరాత్రి సమయంలో టిఫిన్‌ చేసేందుకు లక్ష్మీనాగేశ్వరసాయిమోహన్‌, బాలమురళీకృష్ణ ఇరువురూ కూకట్‌పల్లి సెంటర్‌కు వెళ్లి తిరిగి రూమ్‌కు వస్తుండగా టిప్పర్‌ వాహనం ఢీకొంది. దీంతో సంఘటనాస్థలంలోనే లక్ష్మీనాగేశ్వరసాయిమోహన్‌ అక్కడికక్కడే మృతి చెందగా, బాలమురళీకృష్ణ గాయాలపాలయ్యాడు. మృతదేహాన్ని మంగళవారం స్వగ్రామమైన గణపవరం తరలించారు. ఉద్యోగాన్వేషణకు వెళ్లిన కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందటంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. దీంతో శాంతినగర్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.

హైదరాబాద్‌లో ఘటన

Advertisement
 
Advertisement
Advertisement