రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి

Jun 10 2026 1:31 AM | Updated on Jun 10 2026 1:31 AM

సత్తెనపల్లి: రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన సంఘటన సత్తెనపల్లి మండలం ధూళిపాళ్ల గ్రామ సమీపంలోమంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సత్తెనపల్లి మండలం భృగుబండ గ్రామానికి చెందిన ఇంకొల్లు విజయలక్ష్మి, కులవపద్మ స్కూటీపై సత్తెనపల్లి వస్తుండగా వెనుకగా వస్తున్న ఖాళీ ఇసుక టిప్పర్‌ ఢీకొంది. దీంతో స్కూటీ అదుపు తప్పి కిందపడిపోగా, స్కూటీ వెనుక కూర్చున్న టి.పద్మ (36) తలరోడ్డుకు తగిలి రక్తగాయమై మృతిచెందింది. స్కూటీ నడుపుతున్న విజయలక్ష్మి హెల్మెట్‌ ధరించడంతో స్వల్ప గాయాలయ్యాయి. టిప్పర్‌ను సత్తెనపల్లి రూరల్‌ పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పద్మ మృతితో భర్త నాగేశ్వరరావు, కుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరయ్యారు.

మృతదేహంతో ఇంటి ముందు నిరసన

గుంటూరు రూరల్‌: పొలం తాకట్టు వివాదం నేపథ్యంలో మృతదేహంతో నిరసన తెలిపిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. బాధితులు తెలిపిన వివరాలు.. వెంగళాయపాలేనికి చెందిన చీలి రామారావు(60)కు భార్య భాగ్యలక్ష్మి, కుమారులు ఉన్నారు. ఆయన 2006లో కొన్ని అవసరాల నిమిత్తం నల్లపాడు గ్రామానికి చెందిన చల్లా శ్రీనివాసరెడ్డి వద్ద అప్పు తీసుకున్నారు. ఆ సమయంలో వెంగళాయపాలెంలోని 40 సెట్ల భూమిని తాకట్టు పెట్టారు. పొలం డబ్బు విషయంలో పలుమార్లు పోలీసులు, పెద్దలు జరుగుతున్న వివాదాలకు పలు మార్లు సెటిల్‌ మెంట్‌లు చేశారు. రామారావు అనారోగ్యంతో మంగళవారం మృతి చెందా డు. దీంతో మృతదేహాన్ని రామారావు కుటుంబ సభ్యులు పొలం తీసుకున్న వ్యక్తి ఇంటిముందు ఉంచి నిరసన తెలిపారు. విషయం తెలిసిన గ్రామ పెద్దలు పలువురు ఇరువురికి సర్ది చెప్పి పొలాన్ని విక్రయించి చెరిసగం తీసుకోవాలని నచ్చజెప్పారు.

Advertisement
 
Advertisement
Advertisement