మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు
అచ్చంపేట: వినుకొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడి అరెస్ట్ కుట్రపూరితంగా జరిగిందని, బ్రహ్మనాయుడు ఒక బాధితుడని మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు అన్నారు. స్థానిక సాయిబాబా కల్యాణ మండపంలో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భూమి కొనుగోనులో బ్రహ్మనాయుడు పేరుపై అగ్రమెంట్ లేదు, అసలు బ్రహ్మనాయుడి ప్రమేయమే లేదు, మధ్యవర్తుల మాటలు నమ్మి డబ్బులు ఇచ్చి మోసపోయిన వ్యక్తి బ్రహ్మనాయుడు అని శంకరరావు పేర్కొన్నారు. భూ వివాదాన్ని పరిష్కరించమని బ్రహ్మనాయుడే జిల్లా కలెక్టరును కోరిన బాధితుడు మాత్రమేనన్నారు. అలాంటి వ్యక్తిపై తప్పుడు కేసులు బనాయించి అరెస్ట్ చేయడం రాజకీయ కుట్రలో భాగమేనన్నారు. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకున్న పచ్చమీడియా విష ప్రచారం చేయడం కుట్రలో భాగమేనన్నారు. అసలు మూడున్నర కోట్లు విలువచేసే భూమి రూ.1500 కోట్లు ఎలా అవుతుందో అర్థం కావడం లేదన్నారు. మోసపోయి డబ్బులు పోగొట్టుకున్న వ్యక్తిపై ఎలా కేసులు పెడతారని ప్రశ్నించారు. ఈ చర్యను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని, పెదకూరపాడు నియోజకవర్గ వైఎస్సార్ సీపీ బ్రహ్మనాయుడికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. మీడియా ఉందని ఎలాబడితే అలా రాస్తే సరిపోతుందా అని ప్రశ్నించారు.


