అర్జీలు త్వరితగతన పరిష్కరించేలా చర్యలు | - | Sakshi
Sakshi News home page

అర్జీలు త్వరితగతన పరిష్కరించేలా చర్యలు

Jun 9 2026 5:42 AM | Updated on Jun 9 2026 5:42 AM

జిల్లా పోలీసు కార్యాలయంలో పీజీఆర్‌ఎస్‌ ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ(అడ్మిన్‌) సంతోష్‌ వివిద సమస్యలపై 77 ఫిర్యాదులు

నరసరావుపేట రూరల్‌: పీజీఆర్‌ఎస్‌ అర్జీలకు మొదటి ప్రాధాన్యమిచ్చి త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ(అడ్మిన్‌) జేవీ సంతోష్‌ సూచించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పీజీఆర్‌ఎస్‌ నిర్వహించారు. జిల్లా ఎస్పీ(అడ్మిన్‌) జేవీ సంతోష్‌ కార్యక్రమంలో పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. కుటుంబ, ఆర్థిక, ఆస్తి వివాదాలతోపాటు మోసం తదితర సమస్యలపై 77 ఫిర్యాదులు వచ్చాయి. ఇందులో అధికంగా భార్యాభర్తల వివాదాలపై 15, ఆర్థిక అంశాలపై 12, భూ వివాదాలపై 12, కుటుంబ వివాదాలపై 6, పోలీసులు చర్యలు తీసుకోవడం లేదంటూ ఐదు ఫిర్యాదులు అందాయి. ప్రతి ఫిర్యాదు పట్ల శ్రద్ధ వహించి నిర్ణీత గడువులోగా ఫిర్యాదులను పరిష్కరించేందుకు కృషిచేయాలని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement