జాయింట్ కలెక్టర్ సంజన సింహ
నరసరావుపేట: అర్జీలను సత్వరం అత్యంత నాణ్యతగా పరిష్కరించాలని, ఇందులో ఎలాంటి అలసత్వం ఉండరాదని జాయింట్ కలెక్టర్ సంజనా సింహ పేర్కొన్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజిఆర్‌ఎస్), రెవెన్యూ క్లినిక్‌లకు అధ్యక్షత వహించి జిల్లాలోని ఆయా మండలాల నుంచి వివిధ రకాల సమస్యలతో వచ్చిన అర్జీదారులకు చెందిన 183 అర్జీలు స్వీకరించారు. వీటిలో రెవెన్యూ క్లినిక్ ద్వారా 61 అర్జీలు స్వీకరించగా వాటిలో నరసరావుపేట డివిజన్‌కు చెందినవి 19, సత్తెనపల్లి 28, గురజాల డివిజన్‌వి 14 ఉన్నాయి.


