అధిక బరువు శిశువు జననం | - | Sakshi
Sakshi News home page

అధిక బరువు శిశువు జననం

Jun 8 2026 6:48 AM | Updated on Jun 8 2026 6:48 AM

అధిక బరువు శిశువు జననం ఆప్కాబ్‌ ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌గా రంజిత్‌కుమార్‌

మాచవరం: మాచవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అధిక బరువుతో శిశువు జన్మించినట్లు వైద్యాధికారి ఎస్‌.ప్రసాద్‌ తెలిపారు. మండలంలోని పిల్లుట్ల గ్రామానికి చెందిన డి దివ్యకు 4.6 కిలోల బరువు గల ఆడ శిశువు సాధారణ కాన్పు ద్వారా జన్మించినట్లు తెలిపారు. పీహెచ్‌సీ సిబ్బంది చాకచక్యంగా వైద్య సేవలు అందించి సాధారణ కాన్పు అయ్యేలా కృషి చేసినట్లు తెలిపారు. తల్లీబిడ్డ క్షేమంగా ఉన్నారని తెలిపారు.

కొరిటెపాడు(గుంటూరు): గుంటూరుకు చెందిన సీనియర్‌ ఛార్టర్డ్‌ అకౌంటెంట్‌ కొమ్మినేని రంజిత్‌ కుమార్‌ ది ఆంధ్రప్రదేశ్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌(ఆప్కాబ్‌) బోర్డు ఆఫ్‌ డైరెక్టర్స్‌ నందు ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు ఆప్కాబ్‌ చైర్మన్‌ గన్ని వీరాంజనేయులు నుంచి ఉత్తర్వులు అందినట్లు రంజిత్‌ కుమార్‌ ఆదివారం ‘సాక్షి’కి తెలిపారు. ప్రొఫెషనల్‌ డైరెక్టర్‌గా మూడు సంవత్సరాల పాటు కొనసాగనున్నట్లు ఆయన వివరించారు.

Advertisement
 
Advertisement
Advertisement