పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Jun 7 2026 7:54 AM | Updated on Jun 7 2026 7:54 AM

ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2026 గురువులకు ‘టెట్‌’ టెన్షన్‌..! నిమ్మకాయల ధరలు పులిచింతల సమాచారం నేడు శివాలయం తలుపులు మూసివేత ముగిసిన పురుషుల ఏపీ పీ సెట్‌–2026 ముగిసిన వేసవి క్రికెట్‌ శిక్షణ ధ్రువపత్రాల పరిశీలన సాగర్‌ నీటిమట్టం విద్యాహక్కు చట్టానికి సవరణ చేయాలి ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులను మినహాయించాలి

న్యూస్‌రీల్‌

పరీక్ష పాసైతేనే పదోన్నతులు రెండేళ్లలో టెట్‌ ఉత్తీర్ణత కాకపోతే ఇంటికే.. టెట్‌ నుంచి ఉపశమనం కల్పిస్తామన్న హమీని విస్మరించిన చంద్రబాబు, లోకేష్‌లు సీనియర్‌ ఉపాధ్యాయుల్లో ఆందోళన జిల్లాలో 3,995 మంది ఉపాధ్యాయులు టెట్‌ ఉత్తీర్ణత పొందాలి

రూ. 20 కోట్ల సరుకు అక్రమ రవాణా

జిల్లాలో 3,995 మంది ఉత్తీర్ణులు కావాల్సిందే...

ఆదివారం శ్రీ 7 శ్రీ జూన్‌ శ్రీ 2026
గురువులకు ‘టెట్‌’ టెన్షన్‌..!

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.1,200, గరిష్ట ధర రూ.3,000, మోడల్‌ ధర రూ.2,000 వరకు పలికింది.

అచ్చంపేట: పులిచింతల ప్రాజెక్టులో ప్రస్తుత నిల్వ 32,0877 టీఎంసీలు. దిగువకు 400 క్యూసెక్కులు వదలుతున్నారు.

పెదకాకాని: మల్లేశ్వరస్వామి దేవస్థానం ఆదివారం మూసివేస్తున్నట్లు ఉప కమిషనర్‌ గోగినేని లీలాకుమార్‌, పాలకవర్గం చైర్మన్‌ కోసూరి పూర్ణచంద్రరావు తెలిపారు. శివాలయం ఎదురుగా రోడ్డులో నివాసం ఉంటున్న ఒక వ్యక్తి మృతి చెందడంతో శైవాగమ పద్ధతి ప్రకారం ఆలయ స్థానాచార్యులు, ప్రధాన అర్చకస్వాముల సూచన మేరకు శనివారం సాయంత్రం 4 గంటల నుంచి ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకూ ఆలయ తలుపులు మూసివేస్తున్నట్లు తెలిపారు. ఆలయ సంప్రోక్షణ అనంతరం భక్తులను దర్శనానికి అనుమతిస్తామని వారు తెలిపారు. ఆదివారం సాయంత్రం 4.30 నుంచి రాహుకేతుల పూజలు యథావిధిగా జరుగుతాయన్నారు.

నేటి నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు

పెదకాకాని: ఏపీ పీసెట్‌–2026లో భాగంగా పురుష అభ్యర్థులకు నిర్వహిస్తున్న పరీక్షలు శనివారంతో ముగిశాయి. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆరు రోజులుగా పరీక్షలు నిర్వహిస్తున్న విషయం విదితమే. నాల్గవ రోజు శనివారం 714 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 557 మంది హాజరయ్యారు. ఆదివారం నుంచి మహిళా అభ్యర్థులకు పరీక్షలు నిర్వహించనున్నారు. హాల్‌టికెట్‌ నెంబరు 30001 నుంచి 30680 వరకూ మొత్తం 680 మంది మహిళా అభ్యర్థులకు పరీక్ష నిర్వహిస్తామని కన్వీనర్‌ డాక్టర్‌ పీపీఎస్‌ పాల్‌కుమార్‌ తెలిపారు.

గుంటూరు వెస్ట్‌(క్రీడలు): జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యాన త్రీమెన్‌ కమిటీ సారధ్యంలో నెల రోజుల నుంచి స్థానిక అరండల్‌పేటలోని మాజేటి గురవయ్య హైస్కూల్‌ గ్రౌండ్‌లో నిర్వహిస్తున్న ఉచిత క్రికెట్‌ కోచింగ్‌ క్యాంప్‌ ముగిసింది. త్రీమెన్‌ కమిటీ సభ్యుడు శివరామకృష్ణ మాట్లాడుతూ సుమారు 400 మంది చిన్నారులు ఈ క్యాంప్‌లో పాల్గొన్నారన్నారు. అనుభవజ్జులైన కోచ్‌ల పర్యవేక్షణలో చిన్నారులు ఎంతో నేర్చుకున్నారని తెలిపారు. కార్యక్రమంలో తుంగభద్ర వారియర్స్‌ టీంకు కో ఓనర్‌ ఓ.సాయికృష్ణ తేజ, హిందూ కళాశాల విద్యా సంస్థల సెక్రటరీ రామకృష్ణమూర్తి, త్రీమెన్‌ కమిటీ సభ్యులు నాగరాజు, శరత్‌బాబు, రామకృష్ణ పరమహంస, చిన్నారులు పాల్గొన్నారు.

గుంటూరు ఎడ్యుకేషన్‌: కారుణ్య నియామకాల కోసం దరఖాస్తు చేసుకున్న 111 మంది అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియ శనివారం జెడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించారు. జెడ్పీ డిప్యూటీ సీఈవో సీహెచ్‌ కృష్ణ, అకౌంట్స్‌ అధికారి పి.శామ్యూల్‌ పర్యవేక్షణలో నిర్వహించిన ధ్రువపత్రాల పరిశీలనకు 95 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కార్యక్రమంలో జెడ్పీ పరిపాలనాధికారి ఎన్‌. నిర్మల భారతి, సీహెచ్‌ శ్రీనివాసరావు, జె.శోభారాణి, రాజారత్నబాబు, సిబ్బంది పాల్గొన్నారు.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశయ నీటిమట్టం శనివారం 519.20 అడుగులకు చేరింది. సాగర్‌ జలాశయం నుంచి కుడికాలువకు 7,033, ఎస్‌ఎల్‌బీసీకి 450 క్యూసెక్కులు విడుదలవుతోంది. సాగర్‌ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 7,483 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం జలాశయం నుంచి సాగర్‌ జలాశయానికి 7,483 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

సత్తెనపల్లి: ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్‌) ఉత్తీర్ణత ఉపాధ్యాయులందరికీ తప్పనిసరి అంటూ సుప్రీంకోర్టు వెల్లడించిన తీర్పు ఆందోళన కలిగిస్తోంది. ఉపాధ్యాయులు ప్రస్తుత సర్వీస్‌ కొనసాగించాలన్నా .. ఉద్యోగోన్నతి పొందాలన్నా టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి. 20, 25 ఏళ్ల కిందట ఉపాధ్యాయులుగా ఎంపికై న వారంతా ఈ వయసులో టెట్‌ రాసి ఎలా ఉత్తీర్ణత సాధిస్తారన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తాము పిల్లలకు చదువు చెప్పాలా? పరీక్షకు సిద్ధం కావాలా అనే సందిగ్ధంలో పడ్డారు. ఉపాధ్యాయుల భవితకు సుప్రీం తీర్పు ‘పరీక్ష’గా మారింది. దీనికి తోడు ఐదేళ్లకు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు రెండేళ్ల లోపు టెట్‌ రాసి ఉత్తీర్ణులవ్వాలని సూచించింది. లేనిపక్షంలో ఉద్యోగం నుంచి తొలగిస్తామని ఇది వరకే ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. పదవి విరమణకు ఐదేళ్ల లోపు సర్వీసు ఉన్న ఉపాధ్యాయులకు టెట్‌ నుంచి మినహాయింపు ఇచ్చినప్పటికీ వారికి కూడా పదోన్నతులు రావాలంటే టెట్‌ ఉత్తీర్ణత తప్పనిసరి అంటూ ఉత్తర్వుల్లో పేర్కొంది.

మాట తప్పిన తండ్రీ, కొడుకులు...

‘ఇన్‌ సర్వీస్‌ టీచర్లు ఎవరూ ‘టెట్‌’ నిబంధనలకు భయపడాల్సిన అవసరం లేదు. ఈ విషయంపై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ దాఖలు చేస్తాం. అవసరమైతే పార్లమెంట్‌ లో చట్టసవరణ కూడా చేస్తాం’ అని గతంలోనే చంద్రబాబుతో పాటు ఆయన కుమారుడు లోకేష్‌ హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు వారు నోరు మెదపకపోవడంతో ఉపాధ్యాయులు మండిపడుతున్నారు. తప్పనిసరి పక్షంలోనే మాకు ప్రత్యేక టెట్‌ నిర్వహించాలని కొందరు ఉపాధ్యాయులు సూచిస్తుంటే, మరికొందరేమో ‘20,30 ఏళ్లుగా ఉద్యోగం చేస్తున్నాం, ఈ వయసులో మాకు ఈ పరీక్షేంటి?’ అని భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కష్టమైన పరీక్షే...

ఎప్పుడో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులు ఇప్పుడు టెట్‌ పాస్‌ కావాలంటే కాస్త కష్టమే. ఈ పరీక్ష 150 మార్కులకు ఉంటుంది. ఇందులో అర్హత సాధించాలంటే ఓసీలు 90శాతం, బీసీలు 60 శాతం, ఎస్సీలు 50 శాతం మార్కులు సాధించాలి. అయితే టెట్‌ పేపర్‌–1 పాస్‌ కావాలంటే చైల్డ్‌ డెవలప్‌మెంట్‌, తెలుగు, ఆంగ్లం, పర్యావరణానికి సంబంధించిన అంశాలన్నీ చదవాలి. పేపర్‌–2లో కూడా అదే పరిస్థితి. బయో సైన్స్‌ ఉపాధ్యాయులకు గణితం, తెలుగు పండితులకు సోషల్‌ స్టడీస్‌, ఇలా సంబంధం లేని సబ్జెక్టులు పెట్టి పాస్‌ కావాల్సిందే అంటే ఎలా అని ఉపాధ్యాయులు ఆగ్రహిస్తున్నారు.

మాచర్ల రూరల్‌: చంద్రబాబు కుట్రతోనే, ఆయన కనుసన్నలతో పనిచేసే తెలంగాణ ప్రభుత్వం మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడిపై అక్రమ కేసు నమోదు చేసి జైలుకు పంపిస్తోందని, దీని వెనుక ఎవరున్నా వదిలిపెట్టే ప్రసక్తి లేదని వైఎస్సార్‌ సీపీ పల్నాడు జిల్లా అధ్యక్షుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి(పీఆర్కే) హెచ్చరించారు. విను కొండ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అక్రమ అరెస్టును ఖండిస్తూ శనివారం హైదరాబాద్‌లోని కోర్టు వద్ద పీఆర్కే మాట్లాడారు. తిరుమల, వల్లభ డెయిరీలు లాంటి ఎన్నో పరిశ్రమలను నెలకొల్పి వేలాది మంది కుటుంబాలకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన మచ్చలేని నేత బ్రహ్మనాయుడని, ఆయనను రాజకీయంగా ఎదుర్కోవటం చంద్రబాబు, కూటమి ప్రభుత్వానికి చేతకాక తన పలుకుబడితో అక్రమ కేసులో ఇరికించి ఆయనను జైలుకు పంపించి శునకానందం పొందుతున్నాడని దుయ్యబట్టారు. రాధాకృష్ణ అనే వ్యక్తి భూములను అమ్మజూపేందుకు బ్రహ్మనాయుడు బంధువు రమేష్‌ అనే అతనితో అగ్రిమెంటు చేయించుకొని అడ్వాన్సు మాత్రమే తీసుకున్నారని, రిజిస్ట్రేషన్‌ కూడా జరగకముందే రమేష్‌ ఇది ప్రభుత్వానికి సంబంధించిన జీఓ ఒరిజినలా, కాదా అని పరిశీలించాలని స్వయంగా జిల్లా కలెక్టర్‌ కార్యాలయానికి ఫిర్యాదు చేశాడని, అయితే ఫిర్యాదుదారుల పైనే అక్రమ కేసులు బనాయించి రిజిస్ట్రేషన్‌ జరగని భూములను కబ్జాగా పేర్కొంటూ కేసు నమోదు చేయటం దారుణమన్నారు. బ్రహ్మనాయుడుకు బంధువైన రమేష్‌ భూమి కొనుగోలుకు ఆర్థికంగా సహాయం చేసేందుకు డబ్బును బ్రహ్మనాయుడు సర్దుబాటు చేశాడే కానీ ఆయన పేరు మీద ఎక్కడా అగ్రిమెంట్లు జరగలేదని, ఆ నగదును పూర్తిగా వైట్‌ రూపంలోనే అందించిన విషయాన్ని గుర్తించకపోవటం బాధాకరమన్నారు. ఫిర్యాదు చేసిన వారినే నిందితులుగా చేయటం వెనుక చంద్రబాబు తెలంగాణ ప్రభుత్వాన్ని, అధికారులను ఎంతగా ప్రభావితం చేశాడనేది అర్ధమవుతుందని, ఈ విషయం పై న్యాయం పోరాటం చేసి, బ్రహ్మనాయుడును కడిగిన ముత్యంలా బయటకు తీసుకొస్తామన్నారు. తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేస్తే ఆంధ్రా పోలీసులు అత్యుత్సాహంగా ఆయన కోసం ప్రత్యేక గాలింపులు జరపటం ఏంటని ప్రశ్నించారు. చంద్రబాబు, తెలంగాణ ప్రభుత్వం, అధికారులతో కుమ్మక్కై ఫిర్యాదు దారుడి పైనే కేసు నమోదు చేశారన్నారు. దీని వెనుక ఎవరున్నారో త్వరలోనే వెలికితీస్తామన్నారు. బ్రహ్మనాయుడికి వైఎస్సార్‌సీపీ పూర్తి మద్దతుగా ఉంటుందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి పిన్నెల్లి వెంకట్రామిరెడ్డి, న్యాయవాదులున్నారు.

డీఎస్సీ పోటీ పరీక్షను ఎదుర్కొని ఉద్యోగంలో చేరి 25 నుంచి 35 సంవత్సరాల అనుభవం కలిగిన ఇన్‌ సర్వీస్‌ ఉపాధ్యాయులకు టెట్‌ తప్పనిసరి చేయడం సరైనది కాదు. చంద్రబాబు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేసి కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని ఒప్పించి పార్లమెంట్‌లో విద్యాహక్కు చట్టానికి సవరణ చేయాలి.

–మక్కెన శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి

టెట్‌లో ఇన్‌సర్వీసు ఉపాధ్యాయులను మినహాయించేలా చర్యలు తీసుకోవాలి. ఉపాధ్యాయులందరిలోనూ టెట్‌ పరీక్ష అలజడి రేపుతోంది. ప్రభుత్వం రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయాలి. టెట్‌ అమల్లోకి రాకముందు నియమితులైన ఉపాధ్యాయులకు ఆ పరీక్ష నుంచి మినహాయింపు వచ్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపాలి.

–బంకా వాసుబాబు, పీఆర్‌టీయూ రాష్ట్ర కార్యదర్శి

నరసరావుపేట టౌన్‌: పల్నాడు జిల్లా నుంచి పేదలకు పంచాల్సిన రేషన్‌ బియ్యం టన్నుల కొద్దీ అక్రమంగా తరలిపోతుంది. కార్డులో సభ్యుడికి రూ.50లు చొప్పున చేతిలో పెట్టి అందినకాడికి ప్రజా పంపిణీ బియ్యాన్ని పందికొక్కుల్లా బొక్కుతున్నారు. కొంత మంది అక్రమ డీలర్ల వద్ద నుంచి రేషన్‌ మాఫియా బియ్యాన్ని సేకరిస్తుంది. కార్డు దారుల వద్ద నుంచి కేజీ రూ.10 చొప్పున డీలర్‌లు కొనుగోలు చేసి అక్రమ బియ్యం వ్యాపారులకు రూ.15కు అమ్ముతున్నారు. వీటిని దళారులు రేషన్‌ మాఫియాకు రూ.30కు అమ్మి జేబులు నింపుకొంటున్నారు. జిల్లాలోని నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, చిలకలూరిపేట, మాచర్ల, గురజాల నియోజకవర్గాల నుంచి అక్రమ రేషన్‌ బియ్యం టన్నుల కొద్దీ ప్రతి నెల మొదటి వారంలో తరలిపోతుంది. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవాల్సిన పౌరసరఫరాలు, పోలీస్‌, విజిలెన్స్‌ శాఖల అధికారులు పట్టించుకోకపోవటం ఆందోళన కలిగిస్తుంది.

చెలరేగుతున్న ‘పచ్చ’ మాఫియా

రేషన్‌ బియ్యం మాఫియా పట్టుబడకుండా ఎప్పటికప్పుడు కొత్త దారులు వెతుక్కుంటుంది. బ్లాక్‌ మార్కెట్‌లో కొన్న బియ్యాన్ని అక్రమార్కులు యథేచ్ఛగా జిల్లా సరిహద్దులు దాటిస్తున్నారు. వాటిని రేషన్‌ మాఫియా కాకినాడ పోర్టు ద్వారా అక్రమ రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. మధ్యలో చెక్‌పోస్టుల వద్ద ముట్టచెప్పాల్సిన నెలవారీ మాముళ్లు ఎప్పటికప్పుడు అందుతూనే ఉండటంతో ఈ దందాకు అడ్డు అదుపు లేకుండా పోతుంది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి టీడీపీకు చెందిన నేతలు రేషన్‌ మాఫియాగా అవతారం ఎత్తి కోట్లు గడిస్తున్నారు. కొందరైతే రేషన్‌ బియ్యాన్ని రైస్‌ మిల్లులకు తరలించి రీసైక్లింగ్‌ చేసి తిరిగి మార్కెట్‌లో విక్రయిస్తున్నారు. శనివారం పెట్లూరివారిపాలెం గ్రామం నుంచి అక్రమంగా ఆటోలో తరలిస్తున్న ప్రజా పంపిణీ బియ్యం 6 క్వింటాళ్లను పౌరసరఫరాల శాఖ అధికారులు పట్టుకున్నారు. చర్యల నిమిత్తం నరసరావుపేట రూరల్‌ పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించారు.

పంపిణీ చేసిది రెండు రోజులే..

ప్రజా పంపిణీ బియ్యం ప్రతి నెలా 1వతేదీ నుంచి 15వ తేదీ వరకు చౌకదుకాణాల ద్వారా కార్డు దారులకు పంపిణీ చేయాలి. అయితే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ల నుంచి రేషన్‌ షాపులకు సరుకు వచ్చిన ఒకటి, రెండు రోజులు మాత్రమే పంపిణీ చేసి మిగిలిన సరుకు అంతా బ్లాక్‌ మార్కెట్‌లో అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యం కోసం వచ్చిన కార్డు దారులకు కేజీకి రూ.10 చొప్పున కొందరికి ఇస్తుండగా మరి కొందరికి ఈ నెల సరుకు రాలేదని చెప్పి డీలర్‌లు వెనక్కి పంపుతున్నారు.

అధికారుల మౌనం.. మాఫియాకు వరం

రేషన్‌ మాఫియా చెలరేగిపోతున్నా సంబందిత శాఖ అధికారులు స్పందించక పోవటం అధికారులపై వస్తున్న అవినీతి ఆరోపణలకు బలాన్ని చేకూర్చుతుంది. కొంత మంది డీలర్‌లు ఎంఎల్‌ఎస్‌ గోదాం నుంచే నేరుగా బియ్యం అక్రమ రవాణాకు పాల్పడుతున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై కార్డు దారులు ఫిర్యాదు చేసినా అధికారులు స్పందించటం లేదు. గత కొన్ని నెలలుగా జిల్లాలో ఎక్కడా రేషన్‌ షాపులు, అక్రమ రవాణాపై దాడులు నిర్వహించి కేసులు నమోదు చేసిన దాఖలాలు ఏమి లేవు. అధికార పార్టీకు చెందిన నేతలు అక్రమ రేషన్‌ బియ్యం వ్యాపారం నిర్వహిస్తుండటంతో మిన్నకుండి పోతున్నారన్నా ఆరోపణలు వినిపిస్తున్నాయి.

గుంటూరు మెడికల్‌: ఉమ్మడి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల జీజీహెచ్‌లో 150 కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు విడుదల చేసిన ఫైనల్‌ మెరిట్‌ లిస్టును సవరించి తిరిగి విడుదల చేస్తామని గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకులు (ఆర్డీ) డాక్టర్‌ జి.శోభారాణి తెలిపారు. పిడుగురాళ్ల జీజీహెచ్‌లో కాంట్రాక్టు స్టాఫ్‌నర్సు ఉద్యోగాలకు నకిలీ అర్హత ధ్రువపత్రాలు పెట్టి ఉద్యోగాలు పొందేందుకు కొందరు ప్రయత్నాలు చేస్తున్న విషయాన్ని ఈనెల 3వ తేదీన ‘నర్సింగ్‌ ఉద్యోగాల్లో నకి‘లీల’లు’ అనే శీర్షికన, ఈనెల 5న ‘చదివింది ఒకటి– సర్టిఫికెట్‌ మరొకటి’ శీర్షికన ‘సాక్షి’లో కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో పలువురు అభ్యర్థులు గుంటూరు ఆర్డీ కార్యాలయం వద్దకు వెళ్లి తమ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఫైనల్‌ మెరిట్‌ లిస్టు అభ్యంతరాలు తెలిపేందుకు ఆర్డీ అధికారులు ఒక్కరోజు మాత్రమే గడువు ఇచ్చారు. ఫైనల్‌ మెరిట్‌ లిస్టులో పలు తప్పిదాలు సాక్షి వెలుగులోకి తీసుకు రావడంతో వాటిని సరిచేసి తిరిగి జాబితా ప్రచురిస్తామని ఆర్డీ డాక్టర్‌ శోభారాణి శనివారం వెల్లడించారు. స్టాఫ్‌నర్సు ఉద్యోగానికి జీఎన్‌ఎం, బీఎస్సీ నర్సింగ్‌ చదివిన ఇద్దరూ అర్హులేనని పేర్కొన్నారు. ఎంఎల్‌హెచ్‌సీ, సీహెచ్‌ఓ, యూపీహెచ్‌సీలో చేసిన స్టాఫ్‌నర్సు, ఆరోగ్య మిత్ర, 104, 108 స్టాఫ్‌, రెసిడెన్షియల్‌ కాలేజ్‌ స్టాఫ్‌కు సర్వీసు మార్కులు ఇస్తున్నామన్నారు. ఫైనల్‌ మెరిట్‌ లిస్టులో ఉన్న అభ్యంతరాల సర్టిఫికెట్లు మరలా ఉన్నతాధికారులతో స్క్రూట్నీ చేసి డీఎంహెచ్‌ఓలు, సూపరింటెండెంట్‌ల నుంచి జన్యునిటీ ఆధారంగా సెలక్షన్‌ లిస్టును విడుదల చేస్తామని వెల్లడించారు.

9

ఇన్‌చార్జి కలెక్టర్‌ సంజన సింహ

పల్నాడు జిల్లాలో 1289 చౌకదుకాణాలు ఉన్నాయి. వీటి ద్వారా 6,47,934 రేషన్‌ కార్డు దారులు ప్రతి నెలా 8774 టన్నుల బియ్యాన్ని పంపిణీ చేయాల్సి ఉంది. రేషన్‌ దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్న కిలో బియ్యానికి ప్రభుత్వం రూ.48లు వరకు ఖర్చు చేస్తుంది. జిల్లాకు కేటాయించిన 8774 టన్నులకు రూ.42.11 కోట్లు వెచ్చిస్తుంది. ఇంత పెద్ద మొత్తంలో ప్రజా ధనం ఖర్చు చేస్తున్న ప్రభుత్వం ప్రజా పంపిణీ బియ్యం బ్లాక్‌ మార్కెట్‌కు తరలి వెళ్లకుండా అడ్డుకట్ట వేయలేకపోతుంది. ప్రతి నెలా పల్నాడు జిల్లా నుంచి సుమారు రూ.20 కోట్ల విలువైన రేషన్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

జిల్లాలో ఒకటి నుంచి 10వ తరగతి వరకూ బోధించే ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 6,323 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వహిస్తున్నారు. వారిలో 3,995 మంది టెట్‌లో ఉత్తీర్ణత పొందాల్సి ఉందని విద్యాశాఖ గతంలో గుర్తించింది. అంటే మొత్తం ఉపాధ్యాయుల్లో వీరు 63.18 శాతం మంది ఉపాధ్యాయులు టెట్‌ పాస్‌ కావాల్సి ఉంది. లేని పక్షంలో పదోన్నతులు కోల్పోవడంతో పాటు చివరికి ఉద్యోగాన్ని కూడా కోల్పోవాల్సి ఉంటుంది. ఉపాధ్యాయుల వ్యక్తిగత వివరాలు, సర్వీసు రికార్డులతో పాటు వారు టెట్‌ ఏ సంవత్సరంలో పాస్‌ అయ్యారు?..ఎన్ని మార్కులు సాధించారు?.. ఈ అంశాలన్నీ సీనియార్టీ జాబితా ప్రత్యేక కాలంలో పొందు పరచాలని విద్యాశాఖ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. టెట్‌ పాసైన వారి పేర్లు మాత్రమే స్కూల్‌ అసిస్టెంట్‌, గ్రేడ్‌–2 హెచ్‌ఎం పదోన్నతుల జాబితాలో ఉండేలా చూడాలని ప్రభుత్వం ఆదేశించింది.

Advertisement
 
Advertisement
Advertisement