నకరికల్లు: వివాహితపై లైంగికదాడి కేసులో నిందితులను అరెస్ట్ చేసినట్లు సత్తెనపల్లి రూరల్ సీఐ పి.కిరణ్ తెలిపారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం సీఐ విలేకరుల సమావేశం నిర్వహించి, వివరాలు వెల్లడించారు. ఈనెల 2వ తేదీన చేజర్ల గ్రామానికి చెందిన మహిళపై అదే గ్రామానికి చెందిన కొత్తపల్లి సుధాకర్ అతని సోదరుడు శ్రీను ఇద్దరు కలసి నిర్మానుష్య ప్రదేశంలో ఆమైపె లైంగికదాడి చేసినట్లు ఫిర్యాదు వచ్చిందన్నారు. ఉద్దేశ్యపూర్వకంగా గ్రామశివారులోని పొలాల్లోకి తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు వచ్చిన ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఈ మేరకు ప్రధాన నిందితుడైన కొత్తపల్లి సుధాకర్‌పై తన భార్యను వేధించిన కేసులో 2021లో నకరికల్లు పోలీస్‌స్టేషన్‌లో కేసునమోదైందన్నారు. నకరికల్లు మండలం గుండ్లపల్లి గ్రామానికి చెందిన అవివాహితను పెళ్లి చేసుకుంటానని మాయమాటలు చెప్పి రాజుపాలెం మండలంలో సహజీవనం సాగిస్తూ మోసం చేసిన ఘటనలో రాజుపాలెంలో మరో కేసు నమోదై అరెస్ట్ కాగా ఇటీవలే బెయిల్‌పై వచ్చాడన్నారు. నిందితుడు క్రోసూరు మండలం నాగవరంలో ఎనర్జీ అసిస్టెంట్‌గా పనిచేస్తూ ప్రస్తుతం సస్పెన్షన్‌లో ఉన్నట్లు తెలిపారు.


