వినుకొండ: వివాదాస్పద భూమి లావాదేవీలతో మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకి ఎలాంటి సంబంధం లేదని వైఎస్సార్ సీపీ వినుకొండ పరిశీలకులు బాసు లింగారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం వినుకొండలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ బ్రహ్మనాయుడు బంధువు, ప్రముఖ వ్యాపారవేత్త బొల్లా రమేష్ ఆ భూమిని కొనుగోలు చేసి అగ్రిమెంట్ చేసుకున్నారని, తాము కొన్న భూమికి సక్రమమైన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు ఇవ్వాలని రమేషే స్వయంగా అధికారులకు పిటిషన్ ఇవ్వడం వల్లే ఈ అక్రమాలు బయటపడ్డాయని తెలిపారు.
బాధితులనే
నిందితులుగా మార్చారు..
అక్రమాలపై స్వయంగా పిటిషన్ ఇచ్చిన బాధితులను ఈ కేసులో నిందితులుగా మార్చడం అన్యాయమని లింగారెడ్డి ఆరోపించారు. బొల్లా బ్రహ్మనాయుడును రాజకీయంగా ఎదుర్కొనే శక్తి లేనివారే ఈ తప్పుడు కేసులతో ఆయనపై బురదజల్లుతున్నారని, ఆయన కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అని అన్నారు. కోర్టు ద్వారా నిజానిజాలు త్వరలోనే బయటకు వస్తాయన్నారు. ప్రజా న్యాయస్థానంలో కూడా ప్రజల భారీ మద్దతుతో బ్రహ్మనాయుడు విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు.
బొల్లా అరెస్టు ఖండించిన వైఎస్సార్ సీపీ వినుకొండ నియోజకవర్గ పరిశీలకులు బాసులింగారెడ్డి


