రొంపిచర్ల: మండలంలోని పలువురు వైఎస్సార్ సీపీ నాయకులకు గురువారం అర్థరాత్రి పోలీసులు నిషేధ ఆజ్ఞలను తెలియజేస్తూ నోటీసులు అందజేశారు. బహిరంగ సభలు నిర్వహించటం, ర్యాలీలు, ఊరేగింపులు చేపట్టటం, ధర్నాలు నిరసన కార్యక్రమాలు నిర్వహించటం, ప్రజలను గుంపులుగా సమీకరించటం చేయరాదని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారిలో పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం జనరల్ సెక్రటరీ పడాల చక్రారెడ్డి, గెల్లి చిన్నకోటిరెడ్డి, పార్టీ మండల అధ్యక్ష, ఉపాధ్యక్షులు కురుగుంట శ్రీనివాసరెడ్డి, పునుగోటి వెంకట్రావు, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు అన్నెం పున్నారెడ్డి, పచ్చవ రవీంద్రబాబు, మోతుకూరి వెంకటేష్, చపారపు సంజీవరెడ్డి, గాదె రామిరెడ్డి తదితరులు ఉన్నారు.


