పేదలకు అందుబాటులో కార్పొరేట్‌ వైద్యం | - | Sakshi
Sakshi News home page

పేదలకు అందుబాటులో కార్పొరేట్‌ వైద్యం

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

గుంటూరు మెడికల్‌: పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యాధునిక వైద్య సేవలు అందుబాటులో తీసుకు రావాలనే ఏకైక లక్ష్యంతో గుంటూరు తక్కెళ్ల పా డులోని లతితా పీవీఎస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ హాస్పటల్‌ను ఏర్పాటు చేశామని చైర్మన్‌, సీనియర్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పి.వి.రాఘవశర్మ చెప్పారు. గురువారం హాస్పటల్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడు తూ 36 సంవత్సరాలుగా లలితా గ్రూప్‌ ఆఫ్‌ హాస్పటల్స్‌ ఆధ్వర్యంలో లక్షలాది మందికి వైద్య సేవలు అందించామన్నారు. వైద్య సేవలు మరింత మెరుగ్గా ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతోనే లలితానగర్‌లో 600 పడకలతో అన్ని రకాల వైద్య సేవలతో, ఆహ్లాదకరమైన పరిసరాలతో నూతన ఆసుపత్రిని ప్రారంభించామన్నారు. దక్షిణ భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా ఏఐ, త్రీడీ టెక్నాలజీ ఎమ్మారై స్కానింగ్‌ మెషిన్‌ను ఏర్పాటు చేశామన్నారు. హాస్పటల్‌ సీఈఓ, ఇంట్రవెన్షనల్‌ కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ పోలవరపు అనురాగ్‌ మాట్లాడుతూ గుండె జబ్బు రోగుల కోసం మూడు అత్యాధునిక క్యాథ్‌ల్యాబ్‌లు, పది మంది కార్డియాలజిస్టులు అందుబాటులో ఉన్నారన్నా రు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో తక్కువ ఫీజుతో గుండె చికిత్సలు అందిస్తున్నామని, 36 ఏళ్లలో 15 లక్షల మందికి పైగా రోగులకు సేవలందించామన్నారు. ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌, న్యూరాలజిస్ట్‌, డాక్టర్‌ నరేన్‌ పోలవరపు మాట్లాడుతూ ఏపీలోనే తొలిసారిగా 1990 నుంచి న్యూరాలజీ, కార్డియాలజీ వైద్యసేవలు తాము గుంటూరు కొత్తపేటలో అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. పక్షవాతం ఏవయస్సు వారికై నా రావచ్చని, తమ అడ్వాన్స్‌డ్‌ అంకినీడు స్ట్రోక్‌ సెంటర్‌లో ఏఐ ఆధారిత స్ట్రోక్‌ సేవలు అందిస్తున్నామన్నారు. ఐవీ త్రాంబోలైసిస్‌, మెకానికల్‌ త్రాంబెక్టమీ, రోబోటిక్‌ ఆర్మ్‌ చికిత్సలతో ప్రపంచ స్థాయి న్యూరో వైద్యం అందిస్తున్నామన్నారు. ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌, క్యాన్సర్‌ వైద్య నిపుణులు డాక్టర్‌ బైరపనేని స్రవంతి మాట్లాడుతూ క్యాన్సర్‌ జబ్బులకు సమగ్ర వైద్య సేవలు తమ వద్ద అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రతినెలా రెండో గురువారం పురుషులకు, మహిళలకు ఉచితంగా క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ పరీక్షలు చేస్తున్నామని, వైద్య సేవలను వినియోగించుకోవాలని కోరారు. ఎగ్జిక్యూటీవ్‌ డైరెక్టర్‌, కిడ్నీ వైద్య నిపుణులు డాక్టర్‌ సిరిచందన గంగసాని మాట్లాడుతూ నాణ్యమైన వైద్యం అత్యాధునిక వైద్యం, విద్య పరిశోధన, సమాజ సేవ అనే నాలుగు అంశాలతో తాము వైద్య సేవలు అందిస్తున్నామన్నారు. హెల్త్‌ ఎడ్యుకేషన్‌లో భాగంగా నాలుగు గ్రామాలను దత్తత తీసుకుని, 5వేలకు పైగా ఉచిత వైద్య శిబిరా లు నిర్వహించామన్నారు. మేనేజింగ్‌ డైరెక్టర్‌, సీనియర్‌ న్యూరాలజిస్టు డాక్టర్‌ పమిడిముక్కల విజయ మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలతోపా టు, గుంటూరు ప్రజలకు ఉచిత బస్సు సౌకర్యం ఏర్పాటు చేశామన్నారు. లలిత ఉచిత ఆరోగ్య వాహిని బస్సు ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఇళ్ల వద్దకు వెళ్లి ఉచితంగా స్క్రీనింగ్‌ పరీక్షలు చేసి, జబ్బుల బారిన పడకుండా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఆసుపత్రిలో 120 మందికి పైగా వైద్యులు ఉన్నారని, 24 గంట లు వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని పోగొట్టుకోకుండా ఆధునిక, సాంకేతికతను తీసుకొచ్చి మరింత నాణ్యమైన వైద్య సేవలు అందరికి చేరువ చేసేందుకే నూతన హాస్పటల్‌తో ముందుకు వచ్చామని వెల్లడించారు. సీటీఎస్‌ సర్జన్‌ డాక్టర్‌ అవినాష్‌, న్యూరోసర్జన్‌ డాక్టర్‌ నూతక్కి శ్రీనివాసరావు, జనరల్‌ సర్జన్‌ డాక్టర్‌ ఉమా శంకర్‌, ఎనస్థీషియా హెచ్‌ఓడీ డాక్టర్‌ మహేష్‌, రేడియాజిస్ట్‌లు డాక్టర్‌ లక్ష్మి, డాక్టర్‌ సుష్మ, యూరాలజిస్ట్‌ డాక్టర్‌ శర్వణ్‌కుమార్‌, ఆర్ధోపెడిక్‌ సర్జన్‌ డాక్టర్‌ శివరామకృష్ణ, ఎమర్జెన్సీ మెడిసిన్‌ డాక్టర్‌ సత్యనారాయణలు తమ వైద్య విభాగాల్లో అందిస్తున్న సేవల గురించి వివరించారు.

లలిత పీవీఎస్‌ హాస్పటల్‌ నిర్వాహకులు డాక్టర్‌ రాఘవశర్మ

Advertisement
 
Advertisement
Advertisement