నరసరావుపేట రూరల్: నాభర్తతో టీడీపీ మహిళ నాయకురాలు అక్రమ సంబంధం పెట్టుకుందని, దీన్ని ప్రశ్నించేందుకు వెళితే తనపై దాడికి పాల్పడిందని నరసరావుపేట కర్లకుంట కృష్ణదీప్తి రూరల్ పో లీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ నాయకురాలుకు వేధింపులు ఉన్నట్లు గతంలోనే జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఆమె వల్ల మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం తన పెద్దకుమారుడు ఆత్మహత్యాయత్నం చేసుకుని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని, అతనికి సరైన వైద్యం అందనీయకుండా మహిళ నాయకురాలు ప్రయత్నిస్తుందని ఆరోపించింది. ఆసుపత్రిలో మెరుగైన వైద్యం కోసం తండ్రి సంతకం కావాలంటే మహిళ నాయకురాలి ఇంటి వద్ద ఉన్నాడని తెలిసి అక్కడకు వెళ్లిన తనపై ఆమె దాడికి పాల్పడినట్లు ఫిర్యాదులో పేర్కొంది. నాకు, నాపిల్లలకు మహిళ నాయకురాలి నుంచి ప్రాణ హాని ఉందని, రక్షణ కల్పించి న్యాయం చేయాలని ఫిర్యాదులో కోరింది.
పల్నాడు డీఆర్‌ఓగా అద్దెయ్య
నరసరావుపేట: పల్నాడు జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ)గా ఒంగోలు జీజీహెచ్ అడ్మినిస్ట్రేటర్ కె.అద్దెయ్య నియమితులయ్యారు. ఇప్పటివరకు డీఎస్‌ఓ నారదముని ఇన్‌చార్జిగా వ్యవహరిస్తున్నారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వం పలు విభాగాల్లో పలువురు ఉన్నత అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సత్తెనపల్లి ఆర్‌డీఓగా కె.గోపాలకృష్ణ నియమితులయ్యారు.
ట్రాక్టర్ కిందపడి
యువకుడు మృతి
పెదకూరపాడు : ట్రాక్టర్ రోటవేటర్ కిందపడి యువకుడు మృతి చెందిన ఘటన పెదకూరపాడు మండలం తమ్మవరం గ్రామంలో జరిగింది. ఎస్‌ఐ గిరిబాబు కథనం మేరకు.. తమ్మవరం గ్రామానికి చెందిన పాలకాయల తరుణ్‌శ్రీ పదవ తరగతి పూర్తి చేసి వేసవి సెలవుల్లో ఇంటి వద్ద ఉంటున్నాడు. గురువారం గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ తోట సురేష్‌తో కలిసి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి బాజీ మిరప పొలాన్ని రోటవేటర్ వేసేందుకు గురువారం తెల్లవారుజామున వెళ్లారు. ప్రమాదవశాత్తూ తరుణ్‌శ్రీ రోటవేటర్ కింద పడి మృతిచెందాడు. స్థానికుల సమాచా రం మేరకు తల్లిదండ్రులు నారాయణ, సుజాత పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గిరిబాబు తెలిపారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమరా వతి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
వ్యవసాయ పాలిటెక్నిక్ కోర్సుల రిజిస్ట్రేషన్ గడువు పెంపు
గుంటూరు రూరల్: ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని వ్యవసాయ పాలిటెక్నిక్, గుర్తింపు పొందిన ప్రైవేటు వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలల్లో రెండు, మూడు సంవత్సరాల వ్యవసాయ, సేంద్రియ వ్యవసాయ, విత్తన సాకేంతిక పరిజ్ఞానం, వ్యవసాయ ఇంజినీరింగ్ డిప్లమో కోర్సుల్లో ప్రవేశాలకు గడువు తేదీని ఈనెల 22వ తేదీ వరకూ పొడిగించినట్లు విశ్వవిద్యాలయం రిజిష్ట్రార్ డాక్టర్ ఎ.మణి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గానూ ప్రవేశ వయస్సు 15 ఏళ్లు పూర్తయ్యి ఉండాలనే నిబంధనలు సవరించారని తెలిపారు. ఇంటర్ ఉత్తీర్ణులైన వారు కూడా అర్హులేనని తెలిపారు. మరిన్ని వివరాలకు www. angrau. ap. in వెబ్‌సైట్‌ను సంప్రదించాలన్నారు.


