నరసరావుపేట: స్థానిక ఏపీఎస్‌ఆర్టీసీ డిపోలో నిర్వహిస్తున్న హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్‌లో శిక్షణ పూర్తిచేసుకున్న 24వ బ్యాచ్ అభ్యర్థులకు జిల్లా ప్రజా రవాణా అధికారి టి.అజితకుమారి గురువారం సర్టిఫికెట్‌లు అందజేశారు. శిక్షణ కార్యక్రమం ముగింపు సందర్భంగా శిక్షణ తీసుకున్న డ్రైవర్లను ఉద్దేశించి అజితకుమారి మాట్లాడుతూ డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్‌ఫోన్ వినియోగించవద్దని, చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని, ఏకాగ్రతతో బస్సులను నడపాలని సూచించారు. డ్రైవింగ్ స్కూల్ ప్రిన్సిపాల్, డిపో మేనేజర్ బూదాటి శ్రీనివాసరావు మాట్లాడుతూ మరికొద్ది రోజుల్లో 25వ బ్యాచ్ శిక్షణ కార్యక్రమం ప్రారంభిస్తున్నామని తెలియజేశారు. శిక్షణ తీసుకొదలచిన డ్రైవర్లు ఫోన్ నెంబర్లు 9959225428, 7382896150 సంప్రదించాలని కోరారు. డ్రైవింగ్ ఇన్‌స్పెక్టర్ షేక్ ఎం.సుభాని, సీహెచ్.మోహనరెడ్డి (రిటైర్డ్) పాల్గొన్నారు.


