ఓవర్‌ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం | - | Sakshi
Sakshi News home page

ఓవర్‌ బ్రిడ్జిపై రోడ్డు ప్రమాదం

Jun 5 2026 4:11 AM | Updated on Jun 5 2026 4:11 AM

ముగ్గురు యువకులకు గాయాలు

నరసరావుపేట టౌన్‌: రోడ్డు ప్రమాదంలో ముగ్గురు యువకులకు త్రీవ గాయాలైన సంఘటన బుధవారం అర్థరాత్రి ఓవర్‌ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీసీ కాలనీకి చెందిన ముగ్గురు యువకులు ద్విచక్రవాహనంపై ఆర్టీసీ బస్టాండ్‌ వైపు నుంచి మల్లమ్మ సెంటర్‌కు వెళ్తున్నారు. మార్గంమధ్యలో అంబులెన్స్‌ సడన్‌గా బ్రేక్‌ వేయటంతో వెనుక ఉన్న ట్రాలీ వాహనం ఢీకొంది. అదే సమయంలో అతివేగంగా ద్విచక్రవాహనంపై వస్తున్న ముగ్గురు యువకులు ట్రాలీ వాహనాన్ని ఢీకొన్నారు. సంఘటనలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ద్విచక్రవాహనం పాక్షికంగా దెబ్బతింది. సమాచారం అందుకున్న 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను ఏరియా వైద్యశాలకు తరలించారు. ట్రాఫిక్‌ పోలీసులు ఓవర్‌ బ్రిడ్జి వద్దకు చేరుకొని ట్రాఫిక్‌ను క్రమబద్దీకరించారు. ఎటువంటి ఫిర్యాదు అందలేదని వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement