వాగునూ వదలని తమ్ముళ్లు
చిలకలూరిపేట: పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం మానుకొండవారిపాలెం గ్రామ సమీపం నుంచి కుప్పగంజి వాగు ప్రవహిస్తుంది. ఈ వాగు ఇదే మండలం దండమూడి గ్రామం సమీపానికి చేరుకునేసరికి పెద్ద ఎత్తున వాగు పోరంబోకు భూములు ఉంటాయి. వీటిపై మానుకొండవారిపాలెం గ్రామానికి చెందిన ఓ పచ్చ బ్యాచ్ కన్ను పడింది. ఇంకేముంది సిండికేట్‌గా ఏర్పడి నల్లమట్టి విక్రయాలు అడ్డూఅదుపు లేకుండా కొనసాగుతున్నాయి.
మట్టి తవ్వకాలు, తరలింపునకు రాత్రి వేళను ఎంచుకున్నారు అక్రమార్కులు. వేసవి కాలం కావడం, పొలాల్లో పంటలు లేకపోవడం వారికి కలిసి వచ్చింది. చిలకలూరిపేట పట్టణం నుంచి వెళ్లేటప్పుడు దండమూడి గ్రామ సమీపంలో ఉన్న ఓ పెట్రోల్‌బంకు ఎదురుగా ఉన్న పంట పొలాల నుంచి కుప్పగంజి వాగు వరకు దారిని ఎంపిక చేసుకున్నారు. రాత్రి వేళల్లో రైతులు, అధికారుల నుంచి ఆటంకాలు ఏర్పడకుండా ఈ అక్రమ దందా కొనసాగిస్తున్నారు. వేసవికి ఎండిపోయి సన్నని పాయగా ఉన్న వాగు సమీప పోరంబోకు భూములు తవ్వుతున్నారు. దర్జాగా యంత్రాలను ఏర్పాటు చేసుకొని, తవ్విన మట్టిని తరలించేందుకు 15 ట్రాక్టర్లు ఏర్పాటు చేసుకున్నట్లు సమాచారం. ఒక్కో ట్రాక్టర్ పది ట్రిప్పుల చొప్పున 15 ట్రాక్టర్లతో రోజుకు సుమారు 150 ట్రిప్పుల వరకు మట్టిని తరలిస్తున్నారు. ఒక్కో ట్రిప్పునకు రూ. వెయ్యి వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. వేసవి కాలం ప్రారంభం నుంచి సుమారు నాలుగు నెలలుగా ఈ వ్యవహారం ఆటంకం లేకుండా కొనసాగుతోంది.
●
తమ్ముళ్ల ధన దాహానికి వాగులూ మిగలడం లేదు. ఇసుక, గ్రావెల్ మాత్రమే కాదు... వాగు పోరంబోకు భూముల్లో నల్లమట్టిని సైతం మింగేస్తున్నారు. పర్యావరణం, భవిష్యత్ సమస్యలు పట్టించుకోకుండా మట్టి విక్రయించి భారీగా జేబులు నింపుకొంటున్నారు. అక్రమాలకు పాల్పడుతున్నది అధికార పార్టీ వారు కావడంతో అధికారులు సైతం వేడుక చూస్తున్నారు. మరికొందరు వారితో కలిసి అవినీతికి పాల్పడుతున్నారు.
● విచ్చలవిడిగా మట్టి తవ్వి విక్రయాలు
● రాత్రి వేళల్లో గుట్టుచప్పుడు
కాకుండా వ్యవహారం
● అక్రమ తవ్వకాలతో
ప్రమాదకరంగా గుంతలు
● పట్టించుకోని అధికార యంత్రాంగం
రాత్రి సమయాల్లో...