హైకోర్టు భవనాల వద్ద భద్రతపై సమీక్ష | - | Sakshi
Sakshi News home page

హైకోర్టు భవనాల వద్ద భద్రతపై సమీక్ష

Jun 3 2026 1:03 AM | Updated on Jun 3 2026 1:03 AM

హైకోర్టు భవనాల వద్ద భద్రతపై సమీక్ష తాడికొండ: తుళ్లూరు మండలం నేలపాడు గ్రామ రెవెన్యూ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, శాశ్వత హైకోర్టు భవనాల వద్ద భద్రత ఏర్పాట్లపై మంగళవారం వెలగపూడిలోని నూతన డీఎస్పీ కార్యాలయంలో గుంటూరు జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి గుంటూరు రేంజ్‌ ఐజీ సర్వశ్రేష్ఠ త్రిపాఠి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. హైకోర్టు న్యాయమూర్తుల నివాస సముదాయాలు, శాశ్వత హైకోర్టు భవనాల వద్ద అత్యున్నత స్థాయి భద్రత కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై పలు సూచనలు జారీ చేశారు. సమావేశంలో ఐఎస్‌డబ్ల్యూ ఎస్పీ ఆరిఫ్‌ హఫీజ్‌, ఎస్పీఎఫ్‌ ఎస్పీ ఎం శంకరరావు, ఐఎస్‌డబ్ల్యూ అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, గుంటూరు ఏఆర్‌ అదనపు ఎస్పీ హనుమంతు, ఏపీ హైకోర్టు ఎస్పీఎఫ్‌ అసిస్టెంట్‌ కమాండెంట్‌ శ్రీనివాసరావు, తుళ్లూరు డీఎస్పీ మురళీకృష్ణ, గుంటూరు స్పెషల్‌ బ్రాంచ్‌ డీఎస్పీ అలహరి శ్రీనివాస్‌, తుళ్లూరు సీఐ కొంకా శ్రీనివాస్‌, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ మల్లికార్జున్‌ తదితరులు పాల్గొన్నారు. వ్యర్థాల నిర్వహణ మరింత విస్తృతం వన్యప్రాణుల వేటకు విఫలయత్నం అచ్చంపేట: వన్యప్రాణాలను వేటాడేందుకు దుండగులు విఫలయత్నం చేశారు. వివరాలు.. పల్నాడు జిల్లా, అచ్చంపేట మండలం, మాదిపాడు, చల్లగరిక, తాడువాయి అడవులలో అడపాదడపా జంతువుల వేటకు సంబంధించి ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రి మండలంలోని చల్లగరిగ, తాడువాయి అటవీ ప్రాంతంలో సరానుకుంట వద్ద కొందరు దుండుగులు జంతువులను వేటాడేందుకు సిద్ధపడినట్లు అధికారులకు సమాచారం అందడంతో అప్రమత్తం అయ్యారు. రాత్రి సమయాలలో వేసవితాపంతో ఉండే దుప్పి, జింక, కుందేలు వంటి జంతువులు ఈ కుంటలో ఉండే నీళ్లు తాగేందుకు వస్తుంటాయి. దుండుగులు వాటిని వేటాడేందుకు కుంట వద్ద కాపు కాశారు. విషయం తెలుసుకున్న బీట్‌ అధికారి కొంపెర్ల వరప్రసాద్‌ వారిని వెంబడించారు. ద్విచక్ర వాహనం, నాటు తుపాకీ, పిస్తోలు, కొన్ని బుల్లెట్లను వారు అక్కడే వదిలేసి పారిపోయారు. వాటిని అధికారులు స్వాధీనం చేసుకుని ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి వెంకటరమణ సమాచారం ఇచ్చారు. కేసు నమోదు చేశారు. సామగ్రిని అచ్చంపేట పోలీసుస్టేషనుకు తరలించారు.

తెనాలిటౌన్‌: ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణను మరింత విస్తృతం చేసుకోవాల్సిందిగా భారత ప్రభుత్వ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌ విభాగం డైరెక్టర్‌ సురభి మాలిక్‌ మున్సిపల్‌ అధికారులకు సూచించారు. భారత ప్రభుత్వ హౌసింగ్‌ అండ్‌ అర్బన్‌ ఎఫైర్స్‌ విభాగం డైరెక్టర్‌ సురభి మాలిక్‌, ఏడీబీ కన్సల్టెంట్‌ మనోజ్‌కుమార్‌, ఎన్‌పీఎంయూ దీపక్‌ గోయల్‌లు మంగళవారం తెనాలి పట్టణంలో పర్యటించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్థానిక బుర్రిపాలెం రోడ్డులోని కంపోస్టు యార్డులో ఘన వ్యర్థాల నిర్వహణ, పూలే కాలనీలోని 10 ఎంఎల్‌డీ మురుగునీటి శుద్ధి ప్లాంటును పరిశీలించారు. తెనాలి పట్టణంలో ఘన, ద్రవ వ్యర్థాల నిర్వహణ జరగటంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. కంపోస్టు యార్డులో చెత్త నిర్వహణను ఇప్పుడున్న 1.47 లక్షల టన్నులకు మించేలా చూడాలని చెప్పారు. పూలే కాలనీలోని 10 ఎంఎల్‌డీ ద్రవవ్యర్థాల నిర్వహణ సామర్థ్యాన్ని 15–20 ఎంఎల్‌డీకి పెంచుకోవాలని సూచించారు. మొక్కల సంఖ్యను అధికంగా ఉండేలా చూడాలని సురభి మాలిక్‌ చెప్పారు. రాబోయే రోజుల్లో ప్రతి ఇంటి నుంచి నాలుగు బుట్టల్లో చెత్త సేకరణ జరగాల్సి ఉంటుందని చెప్పారు. కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ జె.రామఅప్పల నాయుడు, ఆరోగ్య అధికారి డాక్టర్‌ మొవ్వా ఏసుబాబు, మున్సిపల్‌ ఇంజినీర్‌ పి.శ్రీకాంత్‌, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement