భక్తిశ్రద్ధలతో బాజీబాబా దర్గా ఉరుసు | - | Sakshi
Sakshi News home page

భక్తిశ్రద్ధలతో బాజీబాబా దర్గా ఉరుసు

Mar 20 2026 8:09 AM | Updated on Mar 20 2026 8:09 AM

భక్తిశ్రద్ధలతో బాజీబాబా దర్గా ఉరుసు దుర్గగుడిలో పలువురికి అంతర్గత బదిలీలు

వేలాదిగా తరలివచ్చిన భక్తులు

పెదకాకాని: బాజీబాబా దర్గా ఉరుసు మహోత్సవం గురువారం కనుల పండువగా ప్రారంభమైంది. పెదకాకాని సయ్యద్‌ బాజీ షహీద్‌ అవులియా దర్గా 538వ ఉరుసు మహోత్సవం పురస్కరించుకొని రాష్ట్రం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. తెల్లవారు జామున ప్రత్యేక ప్రార్థనలతో ఉరుసు మహోత్సవం ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వక్ఫ్‌బోర్డు ఆధ్వర్యంలో దర్గా ఈఓ షేక్‌ ఖాజావలి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఆయా ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు షఫా బావి నీటితో స్నానాలు చేసి దర్గా చుట్టూ ప్రదక్షిణలు చేశారు. సాయంత్రం 7 గంటలకు బాజీబాబా గుఱర్రం దర్గాలో ప్రదక్షిణలు చేసింది. దర్గా ప్రాంగణమంతా భక్తులతో కళకళలాడింది. పెదకాకాని పొలిమేర సెంటర్‌ నుంచి ప్రత్యేక చాందిని అలంకరణలో గంధం బిందెలతో ప్రారంభమైన బాజీబాబా వారి గుర్రంతో శుక్రవారం ఉదయం వరకూ వెనిగండ్ల గ్రామ పురవీధుల్లో గ్రామోత్సవం చేశారు. ఈ మహోత్సవం బాణసంచా వెలుగులు, తీన్‌మార్‌ తప్పెట్లు, సన్నాయి వాయిద్యాలు, బాండ్‌మేళాలు, విద్యుత్‌ కాంతుల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. దర్గాకు చేరుకున్న భక్తులు బాబా వారి గుర్రం వెంట నడిచారు. ఊరేగింపు ముగించుకుని బాబావారి గుర్రం శుక్రవారం సాయంత్రం 3 గంటలకు దర్గాకు చేరుకుంటుందని అనంతరం భక్తులకు గంధం పంచిపెట్టడం, సలామి ప్రార్ధనలతో ఉరుసు మహోత్సవం ముగుస్తుందని ఈఓ షేక్‌ ఖాజావలి తెలియజేశారు.

ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): శ్రీదుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానంలో సూపరింటెండెంట్లు, జూనియన్‌ అసిస్టెంట్లను అంతర్గత బదిలీ చేస్తూ ఆలయ ఈఓ శీనానాయక్‌ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ప్రధాన ఆలయంలో విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌ కె.శ్రీనివాసరావు(చందు)కు సత్రాలు, వేద పాఠశాల, దత్తత ఆలయాలకు బదిలీ చేశారు. వేదపాఠశాల, దత్తత దేవాలయాల విధులు నిర్వహిస్తున్న సూపరింటెండెంట్‌ వి.సత్యనారాయణమూర్తికి కేశఖండనశాల, దుర్గాఘాట్‌, కృష్ణమ్మ హారతుల నిర్వహణ బాధ్యతలు అప్పగించారు. కేశఖండనశాల, దుర్గాఘాట్‌, ఆడిట్‌ జనరల్‌ విధులు నిర్వహిస్తున్న హేమ దుర్గాంబకు ఆడిట్‌, జనరల్‌, అన్న దానం విధులు అప్పగించారు. జూనియర్‌ అసిస్టెంట్‌ ఎం.రమేష్‌ను ప్రధాన ఆలయం నుంచి పారిశుద్ధ్య విభాగానికి బదిలీ చేశారు. అక్కడ పనిచేస్తున్న వి.జగన్నాథరావును ప్రధాన ఆలయ ఇన్‌స్పెక్టర్‌ బాధ్యతలు అప్పగించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement