నడుముకు రాయి కట్టి.. చెరువులోకి పడేసి..! | - | Sakshi
Sakshi News home page

నడుముకు రాయి కట్టి.. చెరువులోకి పడేసి..!

Mar 20 2026 8:09 AM | Updated on Mar 20 2026 8:09 AM

● చెరువు నుంచి బయటకు తీసిన మృత దేహం నడుముకు పొలాల్లో పాతే హద్దు రాయి తాడుతో కట్టి ఉంది. దీంతో ఇది కచ్చితంగా హత్యేనని పోలీసులు నిర్దారణకు వచ్చారు. మృతుని ఆచూకీ కూడా తెలియకుండా ఉండేందుకు ఇలా హద్దు రాయి కట్టి ఉంటారని భావిస్తున్నారు. దీంతో ఎస్‌ఐ ఉన్నతాధికారులకు సమాచారం అందించడంతో ప్రత్తిపాడు సీఐ జి.శ్రీనివాసరావు ఘటనా స్థలికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అనంతరం క్లూస్‌ టీమ్‌, డాగ్‌ స్క్వాడ్‌ లు రంగంలోకి దింపారు. వారు ఆధారాలను సేకరించారు. సమీపంలోని పొలాల్లో పడి ఉన్న హద్దు రాయిని తీసుకువెళ్లి, వ్యక్తికి కట్టి, గోతంలో చుట్టి చెరువులో పడేసినట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. అయితే మృతుని శరీరంపై ఎలాంటి వస్త్రాలు గానీ ఆధారాలు గానీ లేకపోవడంతో ఆచూకీ తెలియలేదు. మృతుడు సుమారు 25 నుంచి 30 సంవత్సరాలు వయస్సు కలిగి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని జీజీహెచ్‌ మార్చురీకి తరలించారు. మృతుని ఆచూకి తెలిసినవారు నేరుగా ప్రత్తిపాడు పోలీస్‌ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు తెలిపారు.

గుర్తుతెలియని వ్యక్తి దారుణహత్య ఈదులపాలెం శివారులో ఘటన

గుంటూరు రూరల్‌: గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురికాగా.. మృతదేహం కూడా కనిపించకుండా చేసేందుకు శరీరానికి హద్దు రాయి కట్టి గోనెసంచిలో చుట్టి చెరువులోకి పడేసిన దారుణ ఘటన మండల పరిధిలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం... ప్రత్తిపాడు మండలం ఈదులపాలెం సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న చెరువులో చేపలు పట్టుకునేందుకు గురువారం ఒక యువకుడు వెళ్ళాడు. ఆ సమయంలో చెరువులో తెలియాడుతూ వ్యక్తి మృతదేహం కనిపించింది. దీంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనా స్థలానికి చేరుకున్న ఎస్‌ఐ నరహరి స్థానికులు, సిబ్బందితో కలిసి మృత దేహాన్ని బయటకు తీయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement