లక్ష్మీపురం: గుంటూరు అరండల్‌పేటలో నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ కంపెనీ పేర్లతో భారీ మొత్తంలో మోసం చేసి పరారైన నిర్వాహకుడిపై బాధితులు గురువారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరండల్‌పేట పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవ్య వారాహి ప్రైవేటు లిమిటెడ్, ట్రేడ్ దోస్త్ పేరుతో అరండల్‌పేట 16వ లైనులో అన్నం పూర్ణచంద్రరావు, మరికొంత మందితో కలిసి గోల్డ్, సిల్వర్ ట్రేడింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నామని, పెట్టుబడి పెట్టిన వారికి 20 నెలల్లో రూ. లక్షకు రూ. 2 లక్షలు కలిపి ఇస్తామని మోసపూరిత మాటలు చెప్పి అక్రమంగా వసూలు చేశారు. పెట్టుబడి పెట్టిన వారి పేర్లపై డ్రా తీసి 40 గ్రాముల బంగారం, తదితర స్కీమ్‌ల పేర్లతో పలువురి నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేశారు. ఇటీవల అన్నం పూర్ణచంద్రరావు తీరుపై అనుమానం వచ్చిన బాధితులు సంబంధిత డ్రాల గురించి నిలదీసే ప్రయత్నం చేయగా.. పూర్ణ చంద్రరావు పరారయ్యాడు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతా శివకోటేశ్వరి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రేడ్ దోస్త్ కంపెనీ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు
Mar 20 2026 8:09 AM | Updated on Mar 20 2026 8:09 AM
ట్రేడ్ దోస్త్ కంపెనీ పేరుతో మోసం చేసిన వ్యక్తిపై కేసు అంబులెన్స్ ఢీకొని వ్యక్తి మృతి నగరం: అంబులెన్స్ ఢీ కొనటంతో ఓ వ్యక్తి తీవ్రగాయాలై మృతి చెందిన సంఘటన మండలంలోని శివంగులపాలెం వద్ద గురువారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ బండ్ల భార్గవ్ వివరాల మేరకు ఒంగోలు నుంచి మచిలీపట్నం వెళ్తున్న ప్రైవేటు ఆంబులెన్స్ శివంగులవారిపాలెం చేరుకున్న సమయంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పీటా గోపాలంను ఢీకొంది. దీంతో గోపాలంకు తీవ్రగాయాలయ్యాయి. చెరుకుపల్లిలోని ఓ ప్రైవేటు హాస్పటల్‌కు తరలించగా ప్రథమ చికిత్స అనంతరం తెనాలి వైద్యశాలకు తరలించే సమయంలో మార్గమధ్యమంలో మృతి చెందాడు. మృతునిది చెరుకుపల్లి మండలం కనగాల గ్రామంగా గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Advertisement
Advertisement


