తెనాలి:మాజీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని తిరిగి అధికారంలోకి తీసుకురావటమే అందరి లక్ష్యంగా కృషిచేద్దామని ఆ పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ అన్నారు. తెనాలి మున్సిపాలిటీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిల్ పదవీకాలం ముగిసిన నేపథ్యంలో గత అయిదేళ్లు చైర్‌పర్సన్లుగా, కౌన్సిలర్లుగా, కో–ఆప్షన్ సభ్యులుగా పదవీకాలం పూర్తిచేసిన సందర్భంగా బుధవారం రాత్రి అభినందన సత్కారాన్ని నిర్వహించారు. తెనాలి నియోజకవర్గ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంగానమ్మపేటలోని శశివేదికలో జరిగిన సభకు పార్టీ తెనాలి సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ లైన్ తప్పకుండా, పార్టీకి ఎలాంటి డ్యామేజి లేకుండా, తనకు ఎలాంటి మచ్చ తేకుండా పరిపాలన చేసిన చైర్‌పర్సన్ తాడిబోయిన రాధికను శివకుమార్ ముందుగా అభినందించారు. ఓటమితో కుంగిపోకుండా పట్టణ అభివృద్ధికి కౌన్సిల్ పాటుపడిందని చెప్పారు. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వంలో అయిదేళ్లపాటు దిగ్విజయంగా ప్రజాసేవలో గడిపే అవకాశం దక్కిందని గుర్తుచేశారు. శాసనసభ్యుడిగా
నియోజకవర్గంలో రూ.1800 కోట్ల సంక్షేమం
నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రూ.1800 కోట్ల సంక్షేమాన్ని అందించే అవకాశం తనకు కలిగినట్టు చెప్పారు. ఓసీలకు రిజర్వు చేసిన తెనాలి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవిని ముస్లిం మైనారిటీలకు కేటాయిస్తానని 2019 అసెంబ్లీ ఎన్నికల ముందు తాను ప్రకటించినట్టు శివకుమార్ గుర్తుచేశారు. ఆ ప్రకారం తొలిగా ముస్లిం మైనారిటీకి చెందిన సయ్యద్ ఖలేదా నసీమ్, తర్వాత బీసీ వర్గానికి చెందిన తాడిబోయిన రాధికకు చైర్‌పర్సన్‌గా అవకాశం కల్పించినట్టు చెప్పారు. 2014 అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా పూర్తికాలం వైఎస్సార్ సీపీ కౌన్సిల్ నడిచేందుకు తాడిబోయిన రమేష్ కృషిచేశారని చెబుతూ ఆయన్ను అభినందించారు. అనంతరం చైర్‌పర్సన్, వైస్‌చైర్మన్లు, వైఎస్సార్‌సీపీ కౌన్సిలర్లు, కో–ఆప్షన్ సభ్యులను శివకుమార్ సత్కరించారు. మాజీ చైర్‌పర్సన్ సయ్యద్ ఖలేదా నసీమ్, మాజీ వై స్‌చైర్మన్లు మాలేపాటి హరిప్రసాద్, కోటేశ్వరరావు, అత్తోట నాగవేణి, కౌన్సిలర్లు పేరం సంజీవరెడ్డి, గెడ్డటి సురేంద్ర, ఝాన్సీవాణి, కుర్రా సుజాత, అన్నాబత్తుని పద్మజ, కఠారి రత్నకుమారి, మల్లెబోయిన సురేఖ, పెదలంక లక్ష్మీలావణ్య, మట్లపూడి సంధ్యారాణి, వీర్లపాటి విజయలక్ష్మి, షేక్ దుబాయ్‌బాబు, షేక్ ఇస్మాయిల్, ఆవుల కోటయ్య, యాతాటి అనిల్, కో–ఆప్షన్ సభ్యులు బచ్చనబోయిన శ్రీనివాసరావు, పెచ్చింగ్ సుభాని, షేక్ గౌసియా, పార్టీ నాయకులు పాల్గొన్నారు.
మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్


