మంగళగిరి టౌన్: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాల్లో భాగంగా స్వామివారు శుక్రవారం రుక్మిణి కళ్యాణం అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ కార్య నిర్వహణాధికారి కోగంటి సునీల్‌కుమార్ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా వింజమూరి శ్రీకృష్ణ రాజేంద్రప్రసాద్ కుమారులు, ఆస్థాన కై ంకర్యపరులుగా శ్రీ ప్రగడ నరసింహమూర్తి వ్యవహరించారు.


