పల్నాడు | - | Sakshi
Sakshi News home page

పల్నాడు

Mar 15 2026 5:00 AM | Updated on Mar 15 2026 5:00 AM

ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026 ఇఫ్తార్‌ సహరి (ఆది) (సోమ) నరసరావుపేట 6.25 5.01 గుంటూరు 6.23 4.59 బాపట్ల 6.23 4.59 జిల్లాలో ఏడాదిలో 673 కేసులు ...

తూకాల్లో మోసం చేస్తే చర్యలు

న్యూస్‌రీల్‌

నిమ్మకాయల ధరలు

సాగర్‌ నీటిమట్టం వివరాలు

ఘనంగా విగ్రహ ప్రతిష్ట

ఆదివారం శ్రీ 15 శ్రీ మార్చి శ్రీ 2026

కాసుల దాహంతో వ్యాపారులు చేస్తున్న మోసం .. కళ మూసుకొని నిద్ర నటిస్తున్న అధికారుల నిర్లక్ష్యం .. వెరసి వినియోగదారుల జేబులకు చిల్లులు పడుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా నిత్యావసర వస్తువుల తూకాల్లో పట్టుతప్పుతున్నా, వాటిని నియంత్రించేందుకు చట్టాలున్నా .. ప్రజల్లో అవగాహన లేమి అవరోధంగా మారింది. ఎవరికి వారే తమకెందుకులే అనే ధోరణిలో ఉండటం వల్ల .. ఈ దందా కొనసాగుతుంది. ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కి అడుగడుగునా కొనుగోలుదారులను ఏమార్చి దోచుకుంటున్నా .. అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

ధర్మం చెర..

సత్తెనపల్లి: ప్రతి ఒక్కరూ ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకు నిత్యావసర సరుకులు, వస్తు సామగ్రి కొనుగోలు చేయాలన్నా .. వినియోగించుకోవాలన్నా ఒక్క క్షణం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ వస్తువు ఎక్కడ కల్తీ జరుగుతుందో, ఎక్కడ నాణ్యత లోపించిందో కనిపెట్టలేని దుస్థితి. నిత్యం ఉపయోగించే పాలు, పెరుగు, కూరగాయలు, గ్యాస్‌ సిలిండర్లు, వాహనాలకు ఉపయోగించే పెట్రోల్‌, డీజిల్‌, చికెన్‌, మటన్‌, చేపలు, కోళ్లు తదితర వాటి గురించి తెలుసుకొని కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఏ వస్తువు కొందామన్నా అధిక ధరలైనా ఉంటాయి.. లేదంటే నాణ్యత లోపం ఉంటుంది. పై వాటిల్లో ఏ వస్తువు వినియోగించినా ఆరోగ్యంగా ఉంటామన్న గ్యారెంటీ కూడా లేదు. ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఒకవేళ తెలుసుకొని ఫిర్యాదు చేసినా, రాత పూర్వకంగా ఫిర్యాదు చేసి తమతో పాటు నడిస్తేనే అలాంటి వారిపై చర్యలు తీసు కుంటామని అధికారులు చెబుతుండడం గమనార్హం. దీంతో తమకెందుకులే అనుకుంటూ ‘ఏదో కొంటున్నాం .. తింటున్నాం’ అని వినియోగదారులు కాలం గడిపే స్తున్నారు.

జిల్లాలో తూనికలు కొలతల శాఖకు సంబంధించి ఇద్దరు ఇన్‌స్పెక్టర్‌లు, ఒక ఏసీ ఉన్నారు. గడిచిన ఏడాదిలో తూనికలు కొలతల శాఖ అధికారులు జిల్లా వ్యాప్తంగా 673 కేసులు నమోదు చేశారు. కాపౌండింగ్‌ ఫీజు కింద రూ. 29.48 లక్షలు, స్టాంపింగ్‌ కింద రూ.66,76,505 వసూలు చేశారు.

సత్తెనపల్లిలో మృతజీవాల మాంసం విక్రయిస్తుండగా పట్టుకున్న మున్సిపల్‌ కమిషనర్‌ ఆనంద్‌కుమార్‌, అధికారులు (ఫైల్‌)

7

దుకాణదారులు తూకాల్లో మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవు. వినియోగదారులకు నాణ్యతా ప్రమాణమైన సరుకులను అందించి ఎమ్మార్పీకే అమ్మకాలను సాగించాలి. దుకాణదారులు కచ్చితంగా తూకాలు ఉండేలా చర్యలు తీసుకోవాలి. వినియోగదారులకు ఏవైనా సందేహాలు ఉంటే 1915 టోల్‌ఫ్రీ నెంబర్‌కు ఫిర్యాదు చేయవచ్చు. ఫిర్యాదులను పరిశీలించిన పరిష్కారానికి చర్యలు తీసుంటుంటాం.

– బీవీ హరిప్రసాద్‌, ఉమ్మడి గుంటూరు జిల్లా డిప్యూటీ కంట్రోలర్‌,

తూనికలు కొలతల శాఖ

తూకాల్లో పెరిగిన మోసాలు

వినియోగదారుల జేబులకు చిల్లు

అడుగడుగునా అవకతవకలు

నాణ్యతలేని సరుకుల విక్రయాలు

అందుబాటులో లేని ధర్మకాటా

నష్టపోతున్న వినియోగదారులు

నేడు వినియోగదారుల హక్కుల

దినోత్సవం

తెనాలి: తెనాలి మార్కెట్‌యార్డులో శనివారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7,000, గరిష్ట ధర రూ.9,000, మోడల్‌ ధర రూ.8,000 వరకు పలికింది.

విజయపురిసౌత్‌: నాగార్జునసాగర్‌ జలాశ య నీటిమట్టం శనివారం 537.70 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 19,172 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.

గొరిగపూడి(భట్టిప్రోలు):గొరిగపూడి పంచాయ తీ వరికూటివారిపాలెంలో శనివారం సీతారామ లక్ష్మణ, ఆంజనేయస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవాలు వైభవంగా జరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement