ప్రస్తుతం ఉన్న స్థలం అవసరం.. | - | Sakshi
Sakshi News home page

ప్రస్తుతం ఉన్న స్థలం అవసరం..

Mar 15 2026 5:00 AM | Updated on Mar 15 2026 5:00 AM

ప్రస్తుతం ఉన్న స్థలం అవసరం.. ఇష్టారాజ్యంగా పడగొట్టడం సరికాదు స్థలం ఇవ్వాల్సింది పోయి..లాక్కోవడమా..? వైఎస్సార్‌ సీపీ జిల్లా కార్యదర్శిగా బాలయ్య

1923లోనే ఈ ఆస్పత్రిని బ్రిటిషు ప్రభుత్వం నిర్మా ణం చేసింది. ఇంత చరిత్ర కలిగిన ఆస్పత్రిని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం రోగులుకూడా అధికసంఖ్యలో చికిత్స పొందుతున్నారు. పంచకర్మ చికిత్స అందించటంతో రోగులు పెరిగారు. భవిష్యత్‌లో ఆస్పత్రి విస్తరించాలంటే ప్రస్తుతమున్న స్థలం అవసరం.

– డాక్టర్‌ వావిలాల సుబ్బారావు, చైర్మన్‌, ధాన్యకటకబుద్ద విహార ట్రస్టు

గ్రామాభివృద్ధి కోసం హెల్త్‌సెంటర్‌ ఏర్పాటు చేసేందుకు స్థలసేకరణ కు ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాలి. ఇష్టారాజ్యంగా గోడలు పడగొట్టటం, మొక్కలు, చెట్లు ధ్వంసం చేయటం మంచిది కాదు.

– భవిరిశెట్టి హనుమంతరావు, వైఎస్సార్‌ సీపీ మండల అధ్యక్షుడు

ఆయుర్వేద వైద్యం అంటేనే మొక్కలు, ఆకులు ఉపయోగించి చేసేది. కొన్ని వైద్యప్రక్రియలు, బతికిఉన్న మొక్కలతో, వాటి ఆకులతో చేయాల్సి వస్తుంది. అందుకోసం వనమూలికల మొక్కలు పెంచటానికి ఇంకా స్థలం కేటాయించాల్సింది పోయి ఉన్న స్థలం లాక్కోవడం సరికాదు.

– కోలా వెంకటేశ్వరరావు, వీహెచ్‌పీ నాయకుడు, అమరావతి

నరసరావుపేట: వైఎస్సార్‌ సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు నరసరావుపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శిఖనం బాలయ్యను పల్నాడు జిల్లా కార్యదర్శి (యాక్టివిటీ)గా నియమిస్తూ కేంద్ర పార్టీ కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement