వైభవంగా విఘ్నేశ్వరుని ఆలయ వార్షికోత్సవం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా విఘ్నేశ్వరుని ఆలయ వార్షికోత్సవం

Mar 10 2026 12:44 PM | Updated on Mar 10 2026 12:44 PM

వైభవంగా విఘ్నేశ్వరుని ఆలయ వార్షికోత్సవం 13న తెనాలిలో కవయిత్రి మొల్లమాంబ జయంతి గోవర్ధనోద్ధరణ అలంకారంలో నారసింహుడు గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పం

రేపల్లె: పట్టణంలోని పెదకూరగాయల మార్కె ట్‌ సమీపంలో వేంచేసియున్న శ్రీసిద్ధి విఘ్నేశ్వరస్వామి ఆలయ వార్షికోత్సవం సోమవారం కనుల పండువగా జరిగింది. వేకువజాము నుంచే ఆలయ అర్చకులు స్వామివారికి సుప్రభాత సేవలతో పంచామృతాలు, పండ్ల రసాలతో అభిషేక మహోత్సవాలు నిర్వహించారు. స్వామివారికి ప్రత్యేక పూజలు, హోమ కార్యక్రమాలు చేసి నైవేద్యాలు సమర్పించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు తీర్చుకున్నారు. అనంతరం ఆలయ ఆవరణలో అన్నసంత ర్పణ జరిగింది. ఆలయ కమిటీ సభ్యులు భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.

తెనాలి: శాలివాహన సంఘం ఆధ్వర్యంలో సుప్రసిద్ధ కవయిత్రి మొల్లమాంబ జయంతిని ఈనెల 13వ తేదీన తెనాలిలో నిర్వహించనున్నారు. ఆరోజు ఉదయం 11.30 గంటలకు బుర్రిపాలెంరోడ్డులోని శ్రీమహాత్మ సేవాశాంతి ఆశ్రమంలో మొల్లమాంబ చిత్రపటానికి పుష్పాంజలి సమర్పించి, ఆశ్రమవాసులకు అన్నదానం చేయటానికి నిర్ణయించినట్టు సంఘ నాయకులు వేజండ్ల శివన్నారాయణ, నిమ్మలూరి కమలాకరరావు సోమవారం సాయంత్రం విలేకరుల సమావేశంలో తెలిపారు. శాలివాహన సంఘీయులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సంఘ నాయకులు మోదుకూరి శివరామకృష్ణప్రసాద్‌, నాంచార య్య, అయ్యవార్లు, క్రిష్టరావు, శంకరరావు, సుబ్రహ్మణ్యం, ఉప్పలపాటి వెంకటేశ్వరరావు, ఉరిటి శ్రీనివాసరావు, పి.జ్వాలారావు, వి.నాగరాజు, ఎం.శ్రీనివాసరావు తదితరులున్నారు.

మంగళగిరిటౌన్‌: మంగళాద్రిలో వేంచేసియున్న శ్రీదేవిభూదేవి సమేత శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆస్థాన అలంకారోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సోమవా రం గోవర్ధనోద్ధరణ అలంకారంలో దర్శనమిచ్చారు. స్వామివారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉత్సవాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి కోగంటి సునీల్‌ కుమార్‌ పర్యవేక్షించగా ఉత్సవ కై ంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన శెనగల రామహనుమాన్‌, శేషాంజనేయ గోపాల్‌లు వ్యవహరించగా, ఆస్థాన కై ంకర్యపరులుగా దుగ్గిరాల మండలం పెదపాలెం గ్రామానికి చెందిన వాసిరెడ్డి మల్లేశ్వరరావు వ్యవహరించారు.

గుంటూరువెస్ట్‌: జి. రామ్‌. జి – గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పమని గుంటూరు జాయింట్‌ కలెక్టర్‌ అశుతోష్‌ శ్రీవాస్తవ అన్నారు. వికసిత్‌ భారత్‌– జి. రామ్‌. జి పోస్టర్‌ను సోమవారం గుంటూరు కలెక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలో విడుదల చేశారు. జేసీ మాట్లాడుతూ గ్రామీణాభివృద్ధికి నూతన సంకల్పం, ఉపాధికి కొత్త హామీగా జి రామ్‌ జి నిలుస్తుందన్నారు. 125 రోజుల ఉపాధికి హామీ ఇస్తుందన్నారు. సమయానికి కూలి చెల్లింపు, ఆలస్య చెల్లింపులకు పరిహారం వంటి అంశాలను ఇందులో చేర్చారన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement