రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌.. గురజాలలో గూండారాజ్‌ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌.. గురజాలలో గూండారాజ్‌

Mar 8 2026 7:49 AM | Updated on Mar 8 2026 7:49 AM

రాష్ట్రంలో జంగిల్‌ రాజ్‌.. గురజాలలో గూండారాజ్‌ ● రాష్ట్రంలో జంగిల్‌రాజ్‌ నడిస్తే గురజాలలో గూండా రాజ్‌ నడుస్తోందని అంతకు తప్పితే ఏమీ లేదని, అభివృద్ధిలో గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంతో పోటీ లేకే భౌతిక దాడులు, మాటలతో ఎదురు దాడులతో కాలం గడుపుతున్నారని ఎద్దేవా చేశారు. శాంతి భద్రతలను తుంగలో తొక్కేవారు భవిష్యత్తులో పర్యావసానాలు అనుభవించాల్సి వస్తుందన్నారు. ఆయనవెంట వైఎస్సార్‌ సీపీ పట్టణ, మండల కన్వీనర్లు మాదాల కిరణ్‌కుమార్‌, చింతా సుబ్బారెడ్డి, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ షేక్‌ జైలాబ్దిన్‌, నాయకులు, ప్రజాప్రతినిధులు షేక్‌ దరియావలి, వీరభద్రునిరామిరెడ్డి, కందులూరి శివయ్య, మందా సుధీర్‌, కోట కృష్ణ, కందుల జాను, జక్కా అశోక్‌, కోసం నాగిరెడ్డి, కాలే మాణిక్యరావు, షేక్‌ అక్బర్‌, సత్తార్‌, సీతారామిరెడ్డి, ఓర్సు దుర్గారావు, జక్కుల అప్పారావు, చల్లగుండ్ల స్వామి తదితరులు ఉన్నారు.

శాంతిభద్రతలను తుంగలో తొక్కుతున్న చంద్రబాబు ప్రభుత్వం గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌ రెడ్డి

పిడుగురాళ్ల: శాంతిభద్రతలను చంద్రబాబు ప్రభుత్వం తుంగలో తొక్కుతుందని గురజాల నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి అన్నారు. పట్టణంలోని పల్నాడు హాస్పటల్‌లో దాచేపల్లి మండలం రామాపురం గ్రామానికి చెందిన ఇటీవల టీడీపీ మూకల దాడిలో గాయపడిన వీరారెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి శనివారం పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... తన బతుకు తాను బతుకుతున్న వీరారెడ్డిని నిన్న సాయంత్రం మాట్లాడాలని తెలుగు దేశం పార్టీ నాయకులు పిలిచి అతి దుర్మార్గంగా కొట్టటం జరిగిందన్నారు. అతణ్ణి హత్య చేసేందుకు యత్నించగా గాయాలతో బయటపడ్డాడన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement