నరసరావుపేట రూరల్: ఇస్సపాలెం మహంకాళి అమ్మవారి 51వ తిరునాళ్ల మహోత్సవాలు రెండవ రోజుకు చేరాయి. శనివారం భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, పొంగళ్లు సమర్పించారు. అధిక సంఖ్యలో పాల్గొన్నారు. పొంగళ్లు పొంగించి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న కలెక్టర్‌కు ఆలయ ఈవో మాధవిదేవి స్వాగతం పలికారు. అమ్మవారికి కలెక్టర్ పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం భక్తులతో కలిసి పొంగళ్లు పొంగించారు. ఆలయ అభివృద్ధి, తిరునాళ్ల ఏర్పాట్లుపై ఆలయ అధికారులతో సమీక్షించారు. భక్తులకు అసౌకర్యం లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఆదివారం జాగరణ ఉంటుందని ఈవో తెలిపారు.
‘అగ్నివీర్ ర్యాలీ’ని సద్వినియోగం చేసుకోండి
నరసరావుపేట: భారత వైమానిక దళంలో అగ్నివీర్ వాయు రిక్రూట్‌మెంట్ ర్యాలీని జిల్లాలోని అర్హులైన యువత సద్వినియోగం చేసుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా శనివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ నెల తొమ్మిదవ తేదీన గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఉదయం 6 నుంచి 10 గంటల వరకు కార్యక్రమం నిర్వహిస్తారన్నారు. ఎటువంటి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ అవసరం లేదని, అభ్యర్థులు నేరుగా రావచ్చునని తెలిపారు.


