మత్స్య అవతారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు | - | Sakshi
Sakshi News home page

మత్స్య అవతారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు

Mar 7 2026 8:17 AM | Updated on Mar 7 2026 8:17 AM

మత్స్య అవతారంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీవారు

మంగళగిరి టౌన్‌ : మంగళాద్రిలో వేంచేసి యున్న శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మి నరసింహస్వామి దేవస్థానంలో స్వామివారి ఆస్థాన అలంకార ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. తొలిరోజు శుక్రవారం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతుడై మత్స్య అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఆలయ ఈవో కోగంటి సునీల్‌కుమార్‌ ఉత్సవాన్ని పర్యవేక్షించారు. ఉత్సవానికి కై ంకర్యపరులుగా హైదరాబాద్‌కు చెందిన దూర్జటి మధుసూధనరావు, చెంచు వెంకట సుబ్బారావులు వ్యవహరించగా, ఆస్థాన కైంకర్యపరులుగా మంగళగిరి పట్టణానికి చెందిన ఇనుమన మిళ్లూరి వెంకట శ్రీరామచంద్ర శర్మ, కృష్ణవేణి దంపతులు వ్యవహరించారు. నేడు స్వామివారు వటపత్రశాయి అలంకారంలో దర్శనమివ్వనున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement