న్యూస్‌రీల్
శనివారం శ్రీ 7 శ్రీ మార్చి శ్రీ 2026
విజయపురిసౌత్: నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం శుక్రవారం 538.90 అడుగులకు చేరింది. శ్రీశైలం నుంచి సాగర్‌కి 19,672 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
తెనాలి: తెనాలి మార్కెట్ యార్డులో
శుక్రవారం క్వింటా నిమ్మకాయలు కనిష్ట ధర రూ.7500, గరిష్ట ధర రూ.9200, మోడల్ ధర రూ.8400 వరకు పలికింది.
ముగిసిన బ్రహ్మోత్సవాలు
పెదపులివర్రు(భట్టిప్రోలు):పెదపులివర్రులో భూ–నీళా సమేత వరదరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. పూజాదికాలను సృజన్‌కుమార్ నిర్వహించగా, ఈవో సాంబయ్య పర్యవేక్షించారు.
ఘనంగా మహిళా దినోత్సవం
నరసరావుపేట: జిల్లా కేంద్రంలో ఈ నెల ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా పేర్కొన్నారు. ముందస్తు ఏర్పాట్లపై శుక్రవారం కలెక్టరేట్ నుంచి డీఆర్‌ఓ, ఆర్‌డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, డీఆర్‌డీఏ, మెప్మా, ఐసీడీఎస్ పీడీలు, వివిధ జిల్లా శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ పెరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించే కార్యక్రమానికి మూడు వేల మంది మహిళలు పాల్గొనున్నారని, అందుకు సంబంధించిన మినిట్స్ తయారు చేయాలని, మెప్మా, డీఆర్‌డీఏ, ఐసీడీఎస్ పీడీలు మూడు వేల మంది మహిళలను సమకూర్చాలని ఆదేశించారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయాలని డీఎంహెచ్‌ఓను ఆదేశించారు. డీఆర్‌డీఏ, మెప్మా ద్వారా మెగా చెక్కు పంపిణీ చేయాలని ఆయా విభాగాల పీడీలకు సూచించారు. జిల్లాలోని ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులను ఆహ్వానించాలని, మహిళ పారిశ్రామికవేత్తలను సన్మానించడానికి, వారి విజయ గాధలను వారే వివరించేలా ఏర్పాట్లు చేయాలని, సీ్త్రశక్తి, డీఆర్‌డీఎ, మెప్మా, సంక్షేమ, పరిశ్రమలు, పోలీస్ శాఖల ద్వారా స్టాల్స్ ఏర్పాటు చేయాలని, ప్రత్యేకంగా మహిళలకు అందించే పథకాలకు సంబంధించినవి పంపిణీకి సిద్ధం చేయాలని సూచించారు.
తుది ఓటరు జాబితా తయారు చేయండి
రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలోని అన్నీ నియోజకవర్గాలకు సంబంధించి తుది ఓటరు జాబితా తయారు చేయాలని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా ఆదేశించారు. ఈనెల 7న గ్రామస్థాయిలో ప్రక్రియ పూర్తిచేసి తొమ్మిదిన పల్నాడు జిల్లాలో ఉన్న గ్రామపంచాయతీ, వార్డుల వారీగా తుది ఓటర్ల జాబితా ప్రచురించాలని అన్నారు. జిల్లా గ్రామపంచాయితీ అధికారి ఎస్.వి.నాగేశ్వర్ నాయక్, సత్తెనపల్లి, గురజాల, నరసరావుపేట డివిజనల్ అభివృద్ధి అధికారులు, డివిజనల్ పంచాయతీ అధికారి, జిల్లాలోని అందరు డిప్యూటీ మండల పరిషత్ అభివృద్ధి అధికారులు పాల్గొన్నారు.
పకడ్బందీగా జనాబా గణన ప్రక్రియ
నరసరావుపేట రూరల్: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 16వ జనాభా గణన ప్రక్రియను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించేందుకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. కేసానుపల్లిలోని ఎంఏఎం ఇంజినీరింగ్ కళాశాలలో జరుగుతున్న జనాభా గణన ప్రక్రియ శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. ఈనెల 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు మూడు రోజుల పాటు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు.
I


