జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓపెన్‌ హౌస్‌ | - | Sakshi
Sakshi News home page

జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఓపెన్‌ హౌస్‌

Mar 7 2026 8:16 AM | Updated on Mar 7 2026 8:16 AM

నరసరావుపేటరూరల్‌: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా పోలీసు కార్యాయలంలో శుక్రవారం ఓపెన్‌ హౌస్‌ నిర్వహించారు. విద్యార్థినులు అధిక సంఖ్యలో ఓపెన్‌ హౌస్‌ను సందర్శించారు. విధి నిర్వహణలో పోలీసులు ఉపయోగించే తుపాకులు, పిస్టల్స్‌, ఆధునిక ఆయుధాలు, కమ్యూనికేషన్‌ పరికరాలు, సెప్టీ గాడ్జెట్‌, మిషనరీ సామగ్రిలను ప్రాక్టికల్‌ డెమో ద్వారా విద్యార్థిను ల కు వివరించారు. మహిళా భద్రత గురించి పోలీసు శాఖ తీసుకుంటున్న చర్యలను వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, స్వీయరక్షణ పద్ధతులు, హెల్ప్‌లైన్‌ నంబర్లపై అవగాహన కల్పించారు. నైతిక విలువలు, ధైర్యసాహసాలు, లైంగిక వేధింపుల ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. మహిళలకు శక్తిని, మానసిక స్థైర్యాన్ని, స్వీయరక్షణ సామర్థ్యాన్ని పెంపొందించే విధంగా ఈనెల 8వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు. అదనపు ఎస్పీ(ఏఆర్‌) వి.సత్తిరాజు, అదనపు ఎస్పీ(క్రైమ్‌) లక్ష్మీపతి, మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ సుభాషిణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement