గుంటూరు ఎడ్యుకేషన్: వైజాగ్‌లో ఆదివారం జరిగిన ఏపీ ప్రైవేటు స్కూల్స్ అసోసియేషన్ రాష్ట్రస్థాయి సమావేశంలో భాగంగా గుంటూరుకు చెందిన మాంటిస్సోరి ఇంగ్లిషు మీడియం పాఠశాల కరస్పాండెంట్ మంజు సెబాస్టియన్‌కు రాష్ట్రస్థాయిలో ఉత్తమ మహిళా పురస్కారాన్ని ప్రదానం చేసినట్లు పాఠశాల ప్రిన్సిపాల్ కేవీ సెబాస్టియన్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన కార్యక్రమంలో భాగంగా వైజాగ్ పోక్సో కోర్టు న్యాయమూర్తి టి.మంగాకుమారి, వైజాగ్ ఆర్జేడీ విజయకుమార్ సమక్షంలో మంజు సెబాస్టియన్‌ను పురస్కారంతో సత్కరించినట్లు తెలిపారు.


